తమిళంలో పవన్ కల్యాణ్ హిట్ సినిమా రీమేక్

కోలీవుడ్‌కి పవన్ కల్యాణ్ హిట్ సినిమా

Last Updated : Jul 30, 2018, 08:29 PM IST
తమిళంలో పవన్ కల్యాణ్ హిట్ సినిమా రీమేక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని చేస్తోన్న ప్రస్తుత రాజకీయాల మాట ఎలా ఉన్నా.. అతడి పాత సినిమా ఒకటి తాజాగా అతడిని మరోసారి సినిమా వార్తల్లోకి తీసుకొచ్చింది. 2014లో రిలీజైన అత్తారింటికి దారేది సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిట్ సినిమాగా నిలవడమే కాకుండా అతడి స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. తాజాగా ఈ సినిమాపై ఓ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ కన్నేసింది. కోలీవుడ్ టాక్ ప్రకారం కోలీవుడ్‌లో అతి పెద్ద చిత్ర నిర్మాణ సంస్థగా పేరున్న లైకా ప్రొడక్షన్స్ అత్తారింటికి దారేది రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 నిర్మాణంలో పాల్పంచుకున్న ఈ చిత్ర నిర్మాణ సంస్థ అత్తారింటికి దారేది రీమేక్ రైట్స్ కొనడం ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అయితే, ప్రస్తుతానికి ఈ రీమేక్‌లో హీరో ఎవరు ? ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు వంటి వివరాలు ఏవీ అందుబాటులో లేవు. 

Trending News