TDP Alliance: విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రన్న పవన్.. టీడీపీ పొత్తుపై సోము క్లారిటీ!

Pawan Kalyan Slams YSRCP: విశాఖ ఘటనపై పవన్ విమర్శల వర్షం కురిపించారు, పవన్ తో భేటీ అయిన సోము వీర్రాజు టీడీపీతో పొత్తు గురించి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 17, 2022, 10:08 PM IST
TDP Alliance: విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రన్న పవన్.. టీడీపీ పొత్తుపై సోము క్లారిటీ!

Pawan Kalyan Slams YSRCP: విశాఖపట్నంలో జనసేన తలపెట్టిన జనవాణి కార్యక్రమం కోసం పవన్ విశాఖ వెళ్లగా అక్కడ చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన అవేమీ నిర్వహించకుండానే వెనక్కు తిరిగి వచ్చేశారు. అలా వచ్చిన తరువాత మంగళగిరిలో మీడియాలో మాట్లాడారు. ఆ తరువాత విజయవాడలో జనసేన, బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయనగరంలో‌ బీజేపీ కార్యకర్తలు నుంచి వైసిపి దాడి ప్రారంభమైందని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు నేతల పై దాడులతో భయ పెడుతున్నారని, అందుకే జనసేన నాయకుల‌పై అన్యాయమైన కేసులు పెట్టారని విమర్శించారు. ఇక నిన్న విశాఖలో జరిగిన ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సన్నాసులు ఏదో వాగుతారు...‌ వారి మాటలను పట్టించుకోనవసరం లేదని పవన్ వైసీపీ నేతలను ఉద్దేశించి కామెంట్ చేశారు. 

Somu Veerraju Clarity on Alliance With TDP: మరో పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్  యాత్రను అడ్డుకోవడం ప్రజా స్వామ్యంలో ఆందోళన కలిగించే అంశమని అన్నారు. జనసేనాధిపతిగా పవన్ అనేక కార్యక్రమాలు, పర్యటనలు‌ చేపట్టారని, వైసీపీ వారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారని మూడు రాజధానుల వ్యవహారం గురించి కామెంట్ చేశారు. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేన పై కుట్ర చేశారని పేర్కొన్న సోము ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని అన్నారు.

ఇక ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని వారు కూడా వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలు పై పోరాడాలని సూచించారని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యల పై పోరు ఉమ్మడిగా సాగిస్తామని, విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాం అని విమర్శించారు. జన స్పందన లేక పోవడంతో కుట్ర కు తెర లేపారని, ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతామని సోము వీర్రాజు అన్నారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది ప్రచారం మాత్రమే అంటూ పొత్తుల అంశం మీద క్లారిటీ ఇచ్చారు. 
Also Read: Pawan Kalyan Vizag Tour: 62 మందికి బెయిల్.. 9 మందికి రిమాండ్.. అందరూ రిలీజ్ అయ్యేవరకు విశాఖలోనే పవన్ కల్యాణ్!

Also Read: Pawan Kalyan Counter: అదే వ్యూహంతో వచ్చారు..ఏం చేసుకుంటారో చేసుకోండి..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News