Hari Hara Veera Mallu: అందుకే సినిమా ఆలస్యం.. హరిహర వీరమల్లు పై క్లారిటీ ఇచ్చిన టీమ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు గురించి గత కొద్దిరోజులుగా ఒక వార్త తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఈ సినిమా ఆగిపోయిందని దర్శకుడు క్రిష్ వేరే సినిమాకి వెళ్లిపోయారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్లు వైరల్ అయ్యాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 09:17 PM IST
Hari Hara Veera Mallu: అందుకే సినిమా ఆలస్యం.. హరిహర వీరమల్లు పై క్లారిటీ ఇచ్చిన టీమ్

Krish Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా ప్రకటించారు. ఈ సినిమా నుంచి పోస్టర్లు.. ఒక చిన్న టీజర్ కూడా విడుదలయ్యింది. కానీ ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతూనే ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు చిత్ర యూనిట్. కరోనా టైం నుంచి ఈ సినిమా షూటింగ్ కి ఏదో ఒక అద్దంకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది అంటూ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం కాసాగాయి. 

ముఖ్యంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని అనుష్కతో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధమయ్యారని ఒక వార్త తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా మేకర్స్.

ఈ సినిమా ఆగిపోలేదు అని పవన్ అభిమానులకు క్లారిటీ ఇవ్వడానికి ఒక పెద్ద పోస్ట్ షేర్ చేశాడు ఈ చిత్ర యూనిట్. “ఈ సినిమాకు సంబంధించిన హై ఎండ్ విఎఫ్ఎక్స్ వర్క్ ప్రస్తుతానికి జరుగుతోంది. ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా జరుగుతున్నాయి. కచ్చితంగా మీ అంచనాలను దాటి ఉండేలాగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాము’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాదు ఈ సినిమా ద్వారా తాము అందించే థ్రిల్ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండమని పేర్కొన్నారు. ఇక అంతేకాక ఒక స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నామని దానికి కూడా సిద్ధంగా ఉండమని యూనిట్ ఈ పోస్టు ద్వారా తెలపడంతో పవన్ అభిమానులకు ఊరట కలిగింది.

 

ఇక ఈ పోస్టులో ఎక్కడ కూడా క్రిష్ పేరు కానీ ఆయన తప్పుకుంటున్నట్లు కానీ మెన్షన్ చేయలేదు. ముఖ్యంగా సినిమా యూనిట్ చేసిన ట్వీట్లో క్రిష్ ట్విట్టర్ అకౌంట్ కూడా ట్యాగ్ చేయడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోలేదు అని వందకి వంద శాతం క్లారిటీ వచ్చింది.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News