Pawan Kalyan birthday: పవన్ ఫ్యాన్స్‌కు ‘తీన్‌మార్’ సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) సినిమాల అప్‌డేట్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న అభిమానులకు మరి కొన్ని గంటల్లోనే తీన్‌మార్ సర్‌ప్రైజ్ దక్కనుంది.  రేపు (సెప్టెంబరు 2న) పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ ( Vakeel Saab teaser ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Last Updated : Sep 1, 2020, 06:19 PM IST
Pawan Kalyan birthday: పవన్ ఫ్యాన్స్‌కు ‘తీన్‌మార్’ సర్‌ప్రైజ్

Pawan Kalyan birthday special: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) సినిమాల అప్‌డేట్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న అభిమానులకు మరి కొన్ని గంటల్లోనే తీన్‌మార్ సర్‌ప్రైజ్ దక్కనుంది.  రేపు (సెప్టెంబరు 2న) పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ ( Vakeel Saab teaser ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. వకిల్ సాబ్ సినిమాలోని పాట మగువా మగువా ( Maguva Maguva song ) రీలిజ్ అయి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ లేదా ట్రీజర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది.  దీంతోపాటు పవన్ కల్యాణ్‌ 27, 28వ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా రానున్నాయి. Also read: Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం 9.09 నిమిషాలకు వకిల్ సాబ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రానుంది.దీంతోపాటు పవన్ 27వ సినిమా క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి మధ్యాహ్నం 12.30గంటలకు అప్‌డేట్ రానుంది. ఇదిలాఉంటే.. పవన్ 28వ సినిమా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. దీనిగురించి సాయంత్రం 4.05 గంటకు అప్‌డేట్ రానుంది. ఏదీఏమైనప్పటికీ రేపు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైన్యానికి పండుగ సందడి దక్కనుందని మాత్రం క్లారిటీ వచ్చింది. Also read: Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

Trending News