Pawan Kalyan: పవన్ 27వ సినిమా అప్‌డేట్.. ఇదే

టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జన్మదినం సందర్భంగా అంతటా సందడి నెలకొంది. ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు ( Pawan kalyan birthday ) తెలియజేస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే వకిల్ సాబ్ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

Last Updated : Sep 2, 2020, 01:37 PM IST
Pawan Kalyan: పవన్ 27వ సినిమా అప్‌డేట్.. ఇదే

Pawan Kalyan 27th fim update: టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) జన్మదినం సందర్భంగా అంతటా సందడి నెలకొంది. ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు ( Pawan kalyan birthday ) తెలియజేస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే వకిల్ సాబ్ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది రిలీజ్ అయి ట్రెండింగ్ అవుతున్న.. కొద్దిసేపటికే అభిమానులకు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ 27వ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్‌కి ముందు కొద్దిరోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ ట్విట్టర్ వేదికగా ప‌వ‌న్ 27వ సినిమా ప్రీ లుక్‌ను విడుద‌ల చేశారు. అప్పట్లో జరిగిన పదిహేను రోజుల‌ షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుందంటూ.. పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  Also read: Happy Birthday Pawan Kalyan: పవన్ కల్యాణ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది..

అయితే.. ప‌వ‌న్ 27వ సినిమా ప్రీ లుక్‌లో చేతికి క‌డియం, న‌డుము, మెడలో ఎర్ర‌ని కండువా, బ్లాక్ షర్ట్‌లో కనిపిస్తున్నారు. అయితే ఆయన పూర్తి ఫొటో కనిపించనప్పటికీ.. ఈ చిత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి స‌రికొత్త జోష్‌ను ఇస్తోంది. ఇందులో పవన్ క్యారెక్టర్ ఉద్యమకారుడి పాత్రలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తుండగా.. సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు. అయితే పవన్ సరసన ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Also read: Pawan Kalyan: వారి మరణం మాటలకు అందని విషాదం

Trending News