గత కొద్దిరోజుల్నించి సినీ పరిశ్రమలో ఆస్కార్ అవార్డుపైనే అందరి దృష్టీ నెలకొంది. కారణం భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్ పోటీలో ఉండటమే. ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఆస్కార్‌పై గురి పెట్టింది.
ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ప్రతి నిర్మాత, దర్శకుడు, నటుడు, టెక్నీషియన్‌కు ఉండే కల ఆస్కార్ అవార్డు మాత్రమే. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో ఇదే అత్యున్నత అవార్డు. 2024 ఆస్కార్ అవార్డుల ప్రకటన మార్చ్ 12వ తేదీన జరగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రకటన మాత్రం ఇవాళ సాయంత్రం 7 గంటలకు జరగనుంది. అంటే ఆస్కార్ అవార్డు నామినేషన్లలో ఏ సినిమాలు ఉన్నాయి, ఏవి ముందున్నాయనేది అధికారికంగా తేలేది ఇవాళే. ఆస్కార్ నామినేషన్ల అధికారిక ప్రకటన కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ oscars.org, abc.com, hulu tv, academy సోషల్ మీడియా ఎక్కౌంట్లలో అందుబాటులో ఉంటుంది.
95వ ఆస్కార్ అవార్డులపై ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాపై ఫోకస్ ఎక్కువగా ఉంది. ఆస్కార్ తరువాత స్థానంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఓ కేటగరీలో గెల్చుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆస్కార్‌పై పడింది. ఇప్పటివరకూ ఉన్నవన్నీ అంచనాలే. అసలేంటనేది ఇవాళ తేలిపోనుంది. ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ భవితవ్యంపై ఇవాళ స్పష్టత రానుంది. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగరీ అవార్డు రావడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ సినిమావైపు చూసింది. గోల్డెన్ అవార్డు లభించినప్పటి నుంచే ఆర్ఆర్ఆర్పై ఆస్కార్ ఆశలు పెరిగిపోయాయి.
Also read: Akkineni Fans: మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook