RRR Movie: బాహుబలి పాయే.. ఇకపై 'నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్': శోభు యార్లగడ్డ

Non RRR Records from Now. అసాధారణ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డులను పోల్చడానికి 'నాన్ బాహుబలి రికార్డ్స్' అని ఒక పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాడుతోంది. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు మరోసారి జక్కన్ననే ఆ రికార్డ్స్ బద్దలు కొట్టనున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 12:52 PM IST
  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌
  • బాహుబలి పాయే
  • ఇకపై నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్
RRR Movie: బాహుబలి పాయే.. ఇకపై 'నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్': శోభు యార్లగడ్డ

Non RRR Records from Now, Baahubali Producer Shobu Yarlagadda Tweet on RRR Movie: సినీ ప్రేక్షకులతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా శుక్రవారం (మార్చి) విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాను వీక్షించేందుకు ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు 5 ఆటలకు టికెట్లు అమ్ముడుపోగా.. విదేశాల్లో రికార్డు స్థాయి వసూళ్లు కురుస్తున్నాయి.

ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన కొందరు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమతమ అభిప్రాయాల్ని పంచుకుని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత సినీ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన 'బాహుబలి' సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై స్పందించారు. 'ఇప్పటి నుంచి నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్' అని ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రికార్డ్స్ అన్ని బాహుబలితో పోల్చారు కదా.. ఇకపై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పోల్చండి అని శోభు యార్లగడ్డ పరోక్షంగా పేర్కొన్నారు. నాన్ ఎస్‌ఎస్‌ఆర్ రికార్డ్స్ అని కూడా మరో ట్వీట్ చేశారు. 

జక్కన్న దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో నటించిన 'బాహుబలి' సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభు యార్లగడ్డ నిర్మించిన బాహుబలి రెండు భాగాలు రికార్డులు కొల్లగొట్టాయి. బాహుబలి 2 తర్వాత ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయలేదు. స్టార్ హీరోల రికార్డులను సైతం ఆ సినిమాల దర్శక నిర్మాతలు 'నాన్ బాహుబలి' రికార్డులు అని పేర్కొనేవారు. బాహుబలి తర్వాత ఇండస్ట్రీ హిట్ అనే మాటలు పక్కనపెట్టేసి.. నాన్ బాహుబలి రికార్డ్స్ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. 

అసాధారణ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డులను పోల్చడానికి 'నాన్ బాహుబలి రికార్డ్స్' అని ఒక పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాడుతోంది. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు మరోసారి జక్కన్ననే ఆ రికార్డ్స్ బద్దలు కొట్టనున్నాడు. బాహుబలిలో ప్రభాస్ ఒక్కడే అయితే.. ఈసారి రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ ఉన్నారు. రికార్డ్స్ పక్కా అని తొలి షో పడగానే అర్ధమయిపోయింది. అందుకే శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. 

Also Read: RRR Movie Collections: ఆర్‌ఆర్‌ఆర్‌ తొలిరోజు కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాకే!!

Also Read: RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News