AU Banks ad starring Aamir Khan and Kiara Advani Stirred into Controversy: ఇప్పటికే ఆదిపురుష్ విషయంలో బాలీవుడ్ పలువురు రాజకీయ నాయకులకు టార్గెట్ అయింది. ఆ సినిమాలో హనుమంతుడికి, రాముడికి తోలు బట్టలు వేశారని, అది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని కొందరు రాజకీయ నేతలు ఇప్పటికే ఆదిపురుష్ టీమ్ మీద మండిపడ్డారు. ఇక తాజాగా బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' అమీర్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు.
తాను నటించిన ఒక యాడ్‌తో హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని అమీర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అమీర్ యాడ్ విషయం మీద మండిపడ్డారు. ఈ యాడ్ గురించి కామెంట్ చేస్తూ ఇలాంటి యాడ్స్ లేదా సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను వక్రీకరించడం ద్వారా మత విశ్వాసాలు దెబ్బతింటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట పనిచేయాలని అన్నారు. ఏయూ బ్యాంక్ కోసం చేసిన ఒక యాడ్ తర్వాత అమీర్ ఖాన్ మరియు నటి కియారా అద్వానీ సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు .
ఆ యాడ్‌లో అమీర్ ఖాన్ - కియారా అద్వానీ కొత్తగా పెళ్లైన వారిలా కనిపించారు. వివాహం చేసుకుని తిరిగి వస్తున్నట్లు వారిని చూపించారు. ఇక వధువు ఇంటి నుంచి అప్పగింతలు ఉండాలి కానీ అలా ఈ యాడ్ లో ఏమీ లేదు. విడిపోయే సమయంలో వారిద్దరూ ఏడవలేదనే చర్చ జరుగుతోంది. సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా, ఈ జంట వధువు ఇంటికి చేరుకుంటారు, ఇక వరుడు వధువు ఇంట్లో కుడికాలు అడుగుపెట్టి మొదటి అడుగు వేస్తున్నట్టుగా ఈ యాడ్‌లో చూపించారు.
అయితే సాంప్రదాయ ఆచారం ప్రకారం, వధువు వరుడి ఇంటికి వెళ్లి అతని ఇంట్లో కుడికాలు పెడతారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ ప్రకటనలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని అమీర్ ఖాన్ ప్రకటనలు చేయాలని మిశ్రా వెల్లడించారు. దీనిపై నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ ఈ విషయం మీద తనకు ప్రశ్నించగా.. 'నాకు కూడా ఫిర్యాదు వచ్చిందని, ఆ ఫిర్యాదు అందిన తర్వాత అమీర్ ఖాన్ ప్రైవేట్ బ్యాంక్ యాడ్ చూశానని అన్నారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఈ రకమైన యాడ్స్ చేయాలని నేను అమీర్ జీని అభ్యర్థిస్తున్నానని ఆయన అన్నారు.
Also Read: Deepika Padukone opens up: రణవీర్ తో విభేదాలంటూ ప్రచారం.. పెదవి విప్పిన దీపిక!
Also Read: Mohan Babu Repeating Mistake: చిరంజీవి చేసిన తప్పే రిపీట్ చేస్తున్న మోహన్ బాబు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook