లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు 'నెగటివ్' కావాలని కోరుకుంటున్నా.. సతీమణిపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలినికి ఇటీవలే కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. నితిన్‌ వేరైటీగా ఆలోచించి శాలిని పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 11:20 AM IST
  • లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు 'నెగటివ్' కావాలని కోరుకుంటున్నా
  • సతీమణిపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • నితిన్‌ భార్య శాలినికి కరోనా
లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు 'నెగటివ్' కావాలని కోరుకుంటున్నా.. సతీమణిపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Nitin celebrates his wife Shalini birthday in Garden: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇప్పడు మళ్లీ పంజా విసురుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతిఒక్కరు మహమ్మారి భారిన పడుతున్నారు. ఏ క్రమంలో టాలీవుడ్‌ (Tollywood) ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే విశ్వేక్‌ సేన్, మంచు మనోజ్, వరలక్ష్యి, మంచు లక్ష్మి, మహేష్‌ బాబు కరోనా బారీన పడ్డారు. ఈ జాబితాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ (Nitin) భార్య శాలిని (Shalini) కూడా ఉన్నారు. ఆమెకు ఇటీవలే కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

నితిన్‌ భార్య (Nitin Wife) శాలిని ప్రస్తుతం హో క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే శాలిని గురువారం పుట్టిన రోజు (Shalini Birthday). ఆమెకు కరోనా సోకడంతో పక్కనే ఉండి సెలెబ్రేషన్స్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. నితిన్‌ వేరైటీగా ఆలోచించి శాలిని పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు. రెండో ఫ్లోర్‌లో ఉన్న శాలినికి కనిపించేలా.. గార్డెన్‌లో కేక్‌ కటింగ్ ప్లాన్ చేశాడు నితిన్‌. స్నేహితులతో కేక్‌ కట్‌ చేసిన అనంతరం గార్డెన్‌ నుంచే  శాలినికి కేక్‌ ఇచ్చి.. తాను తినేశాడు. దాంతో షాలిని సంబరపడిపోయారు. ఆపై అక్కడ ఉన్న వారు శాలినికి విషెష్ చెప్పి.. కేక్ తిన్నారు. షాలిని తన రూం నుంచే అందరికి థాంక్స్ చెప్పారు.

Also Read: స్కూటీ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 8వ తరగతి విద్యార్ధి.. ట్రాఫిక్ పోలీసులకు షాకింగ్ సమాధానమిచ్చిన బాలుడు!!

శాలిని పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియోను నితిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌ అయింది. 'కరోనాకు బారియర్స్ ఉంటాయి కానీ లవ్ కి కాదు. హ్యాపీ బర్త్ డే మై లవ్. లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు 'నెగటివ్' కావాలని కోరుకుంటున్నా' అని వీడియోకు నితిన్ కాప్షన్ ఇచ్చాడు. నితిన్‌కు శాలిని పైన ఉన్న ప్రేమను చూసి.. ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. పోస్ట్ చూసిన అభిమానులు నితిన్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. శాలిని, నితిన్ గతేడాది పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. 

Also Read:  Seerat Kapoor Size Zero: అరె పాపం.. శర్వానంద్‌ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News