Nithya Menon Marriage: పెళ్లికి సిద్దమైన నిత్యామీనన్.. ఆ హీరోతోనేనేనా!

Nithya Menon To Marry A Malayalam Star Hero:  నిత్యామీనన్ కు హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో  పెళ్లి చేసుకోవడం కోసం సర్వం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరోని ఆమె వివాహం చేసుకోబోతోంది అంటున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 04:39 PM IST
  • పెళ్లికి సిద్దమైన నిత్యా మీనన్
  • మళయాళ హీరోతో పెళ్లి అంటూ ప్రచారం
  • అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్
Nithya Menon Marriage: పెళ్లికి సిద్దమైన నిత్యామీనన్.. ఆ హీరోతోనేనేనా!

Nithya Menon To Marry A Malayalam Star Hero: మలయాళ మూలాలు ఉన్న నటి నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచి నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో బాలనటిగా మారింది. నిజానికి పుట్టి పెరిగింది కర్ణాటకలో కావడంతో ఆమె తనను మలయాళీ అనడం కంటే కన్నడ రాష్ట్రానికి చెందిన మహిళ అంటేనే ఎక్కువ ఆనందిస్తానని చెబుతూ ఉంటుంది. తొలుత కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత మలయాళ సినిమాలు కూడా చేశారు.

అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత 180, ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయింది, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, గమనం, నిన్నిలా నిన్నిలా, స్కైలాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో అలరించారు. ప్రస్తుతం ఆమెకు హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో  పెళ్లి చేసుకోవడం కోసం సర్వం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరోని ఆమె వివాహం చేసుకోబోతోంది అంటున్నారు.

ఆయన మరెవరో కాదు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ హీరో అని అంటున్నారు. మలయాళ హీరోతో నిత్యకు గత కొంత కాలంగా సాన్నిహిత్యం ఏర్పడిందని, త్వరలోనే అతనితో కలిసి ఏడు అడుగులు వెయ్యబోతోంది అంటూ మలయాళ వెబ్సైట్లో కథనాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మీద వారు అధికారిక ప్రకటన చేస్తే కానీ తెలియదు.

ఇక ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నిత్యామీనన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ తో పలకరించింది. అయితే ఆ వెబ్ సిరీస్ ఊహించిన మేర అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ప్రస్తుతానికి ఆమె తమిళ, మలయాళ అని చూసుకోకుండా అన్ని రకాల బాషలలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఆ మధ్య ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ వన్ షో కి జడ్జిగా వ్యవహరించిన ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. 

Read Also: Koffee With Karan: సమంతను ఎత్తుకొచ్చిన అక్షయ్.. మాములు రచ్చ కాదుగా ఇది!

Read Also: Mani Ratnam: మణిరత్నంకు కరోనా పాజిటివ్.. ఆ ఈవెంటే అంటించిందా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News