Sreeleela: నేషనల్ లెవెల్ లో శ్రీలీల ఆడిన ఆటలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే

Nithin: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండే హీరోయిన్ ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల. అయితే సినిమాల్లోనే కాదు ఇతర రంగాల్లో కూడా శ్రీలీల ఎంతో ప్రాధాన్యత సంపాదించింది అని నితిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2023, 01:33 PM IST
Sreeleela: నేషనల్ లెవెల్ లో శ్రీలీల ఆడిన ఆటలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే

Extra-ordinary Man Pre-release Event: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరస అవకాశాలు దక్కించుకుంటూ సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది శ్రీలీల. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో మనకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత రవితేజ హీరోగా చేసిన ధమాకా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ మధ్య బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటన ప్రాధాన్యత ఉన్న రోల్ చేసి తనేంటో రుజువు చేసుకుంది ఈ హీరోయిన్. కాగా ఆ తరువాత వచ్చిన ఆదికేశవ చిత్రం మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ప్రస్తుతం శ్రీ లీల తన ఆశలన్నీ నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా పైన పెట్టుకుంది. 

వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ చిత్రం ప్రి రిలిజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ శ్రీ లీలా తో పాటు ఈ సినిమాలో ప్రాధాన్యత పాత్ర పోషించిన రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. కాగా ఈ నేపథ్యంలో నితిన్ శ్రీలీల గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం ఆమె ఫాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

 ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల గురించి నితిన్ మాట్లాడుతూ ఆమెకు నటనే కాకుండా మరిన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని బయటపెట్టాడు. నితిన్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నేను హీరో, డ్యాన్స్ వచ్చు నాకు అని మాములుగానే ఉంటుంది. శ్రీలీల కూడా హీరోయిన్ కాబట్టి బాగా యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుందని తెలుసు. అంతే కాదు తాను డాక్టర్ చదువుతుందని తెలుసు. షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది. తన గురించి అడిగితే చెప్పింది. తాను యాక్టింగ్, డ్యాన్స్, డాక్టర్ మాత్రమే కాదు మరిన్ని వాటిల్లో టాపర్ అని నాకు అప్పుడే తెలిసింది. శ్రీలీల స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది, హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది. తనకి కూచిపూడి, భారత నాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ కూడా వాయిస్తుంది. ఇంకా చాలా చెప్పింది. నేను ఆ రోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన ట్యాలెంట్స్ బయటపడేవి. అసలు తాను చెప్పిన నేనే ఆశ్చర్యపోయా. ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ ఉన్నాయా అనిపించింది’ అని అసలు విషయం బయట పెట్టారు హీరో నితిన్.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News