Nikhil Siddharth: ఇప్పటివరకూ 20 సార్లు ఆ పాట చూశాను.. చూసిన ప్రతిసారీ ఏడ్చేశా: నిఖిల్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి తాజాగా విదులైన జనని పాటని ప్రశంసిస్తూ యువ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ ఓ ట్వీట్‌ చేశాడు. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన జనని పాట తనకు ఎంతగానో నచ్చిందన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 06:25 PM IST
  • ఇప్పటివరకూ 20 సార్లు జనని పాట చూశా
  • జనని పాట ఎంతగానో నచ్చింది
  • ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం నిఖిల్‌ విజ్ఞప్తి
Nikhil Siddharth: ఇప్పటివరకూ 20 సార్లు ఆ పాట చూశాను.. చూసిన ప్రతిసారీ ఏడ్చేశా: నిఖిల్‌

Nikhil Siddharth says I saw Janani Song 20 times, Each time I cried: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR). మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan), యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR)లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ఈ చిత్రం​ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రోమో పాటలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా రిలీజ్ అయిన జనని సాంగ్ (Janani Song) అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాటని ప్రశంసిస్తూ యువ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ఓ ట్వీట్‌ చేశాడు. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన జనని పాట తనకు ఎంతగానో నచ్చిందన్నాడు.

'జనని పాట (Janani Song)ను ఇప్పటివరకూ 20 సార్లు చూశాను. చూసిన ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయి. మొదటిసారి అయితే ఈడ్చేశాను. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమా దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేసే చిత్రమవుతుందని నేను భావిస్తున్నాను. ఎమ్‌ఎమ్ కీరవాణి సర్, ఎస్‌ఎస్ రాజమౌళి సర్.. మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి నాదొక చిన్న విన్నపం. దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి పన్ను మినహాయింపు ఇవ్వాలనికోరుతున్నా' అని నిఖిల్‌ సిద్ధార్థ్ (Nikhil Siddharth) శనివారం తన ట్వీటులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. మరి నిఖిల్‌ కోరుకుంటున్నట్టు పన్ను మినహాయింపు లభిస్తుందో లేదో చూడాలి. 

Also Read: Krunal Pandya: సంచల నిర్ణయం తీసుకున్న కృనాల్‌ పాండ్యా.. గుడ్‌బై చెప్పేశాడు!!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) సైతం జనని పాటపై స్పందించారు. పాట విన్నాక తనకు మాటలు రాలేదని, భావోద్వేగానికి లోనయ్యానని స్వీటీ తెలిపారు. జనని పాటలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ (Ajay Devgn) కూడా కనిపించాడు. ఆయన చెప్పే డైలాగ్‌ కూడా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా అజయ్ మాట్లాడుతూ.. రాజమౌళితో పని చేసిన అనుభవం చాలా గొప్పగా ఉందన్నాడు. రాజమౌళి ఆలోచనా విధానమే వేరుగా ఉంటుందని ప్రశంసించాడు. సునీల్ కథానాయకుడిగా వచ్చిన 'మర్యాద రామన్న' చిత్రాన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్‌'గా రీమేక్ విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

Also Read: Pragya-Salman: సల్మాన్ సినిమాలో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్టే వచ్చి...చివరకు..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఒకటి. ఎక్కడ విన్నా, చూసినా ఈ సినిమా గురించే సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్‌ (Alia Bhatt), ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్‌ (Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎమ్‌ఎమ్ కీరవాణి (MM Keeravani) సంగీతం సమకూర్చుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News