NBK - Akhanda: అఖండ 2 మొదలయ్యేది అప్పుడే.. బాలయ్య కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే ప్లాన్..

NBK - Akhanda 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి  కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమా ఎపుడు మొదలు పెట్టబోయే డేట్ ఫిక్స్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2024, 12:40 PM IST
 NBK - Akhanda: అఖండ 2 మొదలయ్యేది అప్పుడే.. బాలయ్య కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే ప్లాన్..

NBK - Akhanda2:  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో కరోనా టైమ్‌లో తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్న టైమ్‌లో అఖండ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు మిగతా హీరోలు తమ సినిమాలను ఎంచక్కా రిలీజ్  చేసుకోవచ్చమే భరోసా కల్పించిన చిత్రం అఖండ.  తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర దర్శకుడు బోయపాటి ప్రకటించారు. అఖండ 2 టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సీక్వెల్‌కు సంబంధించిన కథను పూర్తి స్థాయిలో రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర కూడా ఉండబోతుందట. ఈ సినిమాలో  ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో బాలయ్య ముసలి గెటప్‌లో అది కూడా సాధువు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర స్కెచ్ రెడీ కూడా చేసాడట. త్వరలో బాలకృష్ణపై ఈ పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా చేయబోతున్నాడట. ఈ సినిమాను పూర్తిగా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో బోయపాటి శ్రీను 'అఖండ'ను మించి రీతిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

'అఖండ' సినిమాలో బాలయ్య  అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనే టైటిల్ పాత్రతో పాటు.. మురళీ కృష్ణ అనే సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు. కవల సోదరులు జాతక రీత్యా ఎలా వేరు పడ్డారు.. అందులో ఒకరు అఘోరా ఎందుకు మారాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్ధం మళ్లీ తన ఊరు వచ్చి ఎలా దుష్టులను అంతం చేసాడనేదే 'అఖండ' మూవీ స్టోరీ. ఇక రాబోయే అఖండ 2లో బాలయ్య మూడు పాత్రలు చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత నవంబర్‌లో స్టార్ట్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా క్లైమాక్స్‌లో పాప కోసం మళ్లీ వస్తానని చెప్పడంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పాడు. ఇపుడు అదే స్టోరీని బోయపాటి శ్రీను తమ టీమ్‌తో కలిసి అఖండను మించిన తీరులో అఖండ 2 స్టోరీ రెడీ చేసారట. ఇప్పటికే కథ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాబీ దేవోల్ నటిస్తున్నారు.

ఆ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయట. ఇప్పటికే బాలయ్య డేట్స్‌తో పాటు బోయపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయనే టాక్ వినిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లేదా బాబీ దేవోల్ ఇద్దరిలో ఎవరు ఒకరు నటించడం పక్కా అని చెబుతున్నారు. 'అఖండ 2' సినిమాను ఒకేసారి తెలుగు సహా హిందీ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట.

Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News