Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

Nayanthara Chennai Residence: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. కొన్నాళ్ళ క్రితం ఎగ్మోర్ ప్రాంతంలో.. తన భర్త పిల్లలతో నివసించేది. కానీ అక్కడ ఒకసారి ఆటో డ్రైవర్ తో, మరొక సారి డెలివరీ అబ్బాయితో నయనతారకి పెద్ద గొడవ అయిందట. ఆ గొడవ కారణంగానే నయనతార.. ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ గొడవ ఎందుకు జరిగిందో తెలుసా.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 17, 2024, 11:58 AM IST
Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

Nayanthara New House: 

సౌత్ లో నయనతార.. గురించి తెలియని వారు ఉండరు. అటు తెలుగులో మాత్రమే కాక.. ఇటు తమిళ్లో కూడా నయనతార.. వరుస సూపర్ హిట్లతో ముందుకు దూసుకుపోతుంది. అభిమానులు.. లేడీ సూపర్ స్టార్.. అని ప్రేమగా పిలిచే.. నయనతార.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించి.. 2022లో పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లయిన కొద్ది నెలలకి.. సరోగసి ద్వారా ఈ జంట ఇద్దరు ..మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలకు ఉయిర్, ఉలగ్ అని పేర్లు పెట్టారు. పిల్లల తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న నయనతార.. అటు సినిమాలను మాత్రమే కాక.. ఇటు పిల్లలతో కూడా బిజీగా ఉంది. సినిమా జీవితంతో పాటు.. వ్యక్తిగత జీవితాన్ని కూడా నయనతార బాగానే బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం నయనతార.. తన భర్త పిల్లలతో పాటు చెన్నైలోని పోయిస్ గార్డెన్‌ లో ఒక అందమైన, ఖరీదైన బంగ్లాలో నివసిస్తుంది. ఈ ఇంటికి మారక ముందు వరకు నయనతార, విగ్నేష్ శివన్.. చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఉండేవారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నయనతార ఆ ఇంటి నుంచి మారడానికి కారణం.. అక్కడ ఒక ఆటో డ్రైవర్, ఒక డెలివరీ బాయ్ తో గొడవ అవ్వడమే అని చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది.

వివరాల్లోకి పెడితే…ఆ ఇంట్లో ఉంటున్న సమయంలో ఒకసారి అక్కడే ఉన్న గార్డెన్ లో నయనతార అతను పిల్లలను ఆడిస్తుందట. ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ఆటోని వేగంగా నడుపుకుంటూ వచ్చాడట. దీంతో కోపం తెచ్చుకున్న నయనతార పిల్లలు.. ఉండే ఏరియాలోకి అంత స్పీడ్ గా ఆటోని ఎలా నడుపుతావు.. అంటూ అతనితో గొడవకి దిగిందట. 

ఇది అయిపోయాక మరొకసారి ఒక ఫుడ్ డెలివరీ అబ్బాయి.. ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడట. అంతా పెద్దగా మాట్లాడుతూ.. పిల్లల్ని డిస్టర్బ్ ఎందుకు చేస్తావు అని నయనతార అతనితో కూడా గొడవ పడిందట. ఇక అపార్ట్మెంట్లో కూడా తరచుగా గొడవలు.. జరుగుతూ ఉండేవట. అందుకే నయనతార ఇల్లు ఖాళీ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ కారణాలు విన్న నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

ఎంత పిల్లలు ఉన్నప్పటికీ ఆటో వాడు ఆటో నడపకుండా, డెలివరీ అబ్బాయి ఫోన్లు మాట్లాడకుండా ఉండమంటే చాలా కష్టం అని.. నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ఈ మధ్యనే జవాన్, అన్నపురాని సినిమాలలో కనిపించిన నయనతార.. ఇప్పుడు మరొక రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా నయనతార ఒక హిందీ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News