Nawazuddinn Siddiqui News: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై ఆయన భార్య ఆలియా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు ఈ విషయంపై నటుడు ఎటువంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ, ఇప్పుడు తాజాగా ఈ విషయంలో తన మౌనాన్ని వీడి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ పోస్ట్ పెడుతూ ఇది ఆరోపణ కాదు, కానీ నేను నా భావాలను వ్యక్తం చేస్తున్నాను అంటూ ఈ విషయంలో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా జత చేశారు.
ఇక ఈ ప్రకటనలో, నటుడు తనపై వచ్చిన ఆరోపణలకు, పిల్లల చదువుకు సంబంధించి చాలా విషయాలు రాశారు. తన మౌనం వల్ల ప్రజలు తనను చెడ్డ వ్యక్తిగా పరిగణిస్తున్నారని, ఇదంతా నా పిల్లలకు మాత్రమే అని నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని అన్నారు. నేను ఆలియా చాలా సంవత్సరాల క్రితం విడిపోయామని, మేము కూడా విడాకులు తీసుకున్నాము అని అందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. అయినప్పటికీ మా పిల్లల వల్ల మా మధ్య చాలా అవగాహన ఉందని, అదే సమయంలో, రెండవ పాయింట్‌లో పిల్లల చదువుకు సంబంధించి గత 45 రోజులుగా నా పిల్లలు ఎందుకు పాఠశాలకు వెళ్లడం లేదని ఎవరైనా నాకు చెబుతారా? మీ పిల్లలు బడికి రావడం లేదని స్కూల్ నుంచి నాకు నిరంతరం ఉత్తరాలు వస్తున్నాయని ప్రశ్నించారు.
This is not an allegation but expressing my emotions. pic.twitter.com/6ZdQXMLibv
— Nawazuddin Siddiqui (@Nawazuddin_S) March 6, 2023
అయితే అందరికీ ఇప్పటి వరకు ఆలియా వైపు మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు నవాజుద్దీన్ మొదటిసారి చెప్పినది చదివిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారు దుబాయ్‌లో చదువుతున్నాడు కానీ పాఠశాలకు వెళ్లడం లేదు అంటూ నాకు పాఠశాల నుండి ఉత్తరాలు వస్తున్నాయని అన్నారు. రెండేళ్లుగా ఆలియాకు ప్రతినెలా రూ.10 లక్షలు ఇస్తున్నానని, అవి కాక పిల్లల ఫీజులు, వైద్యం సహా ప్రయాణ ఖర్చులు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు.
2 సంవత్సరాల ముందు, ప్రతి నెలా 5-7 లక్షల రూపాయలు ఇచ్చేవాడిని అని అన్నారు. అలాగే ఆమె దుబాయ్‌లోని పిల్లలతో కలిసి విలాసవంతమైన ఇంట్లో నివసిస్తుందని, అక్కడ తన పిల్లలకు విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఇది కాకుండా, ముంబైలో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ కూడా ఉందని, ఇన్ని ఉన్నా డబ్బుపై దురాశతో ఆలియా తన పరువు తీస్తోందని తెలిపాడు.
Also Read: Anicka Vikramman: నటిని చచ్చేలా కొట్టిన ప్రియుడు.. కలకలం రేపుతున్న ఫొటోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nawazuddin Siddiqui: కోట్లకు కోట్లు ఇచ్చా.. దుబాయ్, ముంబైల్లో ఫ్లాట్లు కూడా ఇచ్చా.. భార్య గుట్టు విప్పిన నవాజుద్దీన్ సిద్దిఖీ