Dasara Real Story: దసరా కధ నిజంగానే అక్కడ జరిగిందట.. మరీ ఇంత అరాచకమా?

Dasara is Real Story Says Director Srikanth Odela: నాని హీరోగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 15, 2023, 10:26 PM IST
Dasara Real Story: దసరా కధ నిజంగానే అక్కడ జరిగిందట.. మరీ ఇంత అరాచకమా?

Nani's Dasara is Real Story Happened: నాని హీరోగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేశారు.

పూర్తి స్థాయి తెలంగాణ యాసలో సాగిన ఈ సినిమా కేవలం తెలంగాణ ప్రాంత వాసులను మాత్రమే కాదు తెలుగు వారందరినీ అలరించింది. తెలంగాణలోని గోదావరిఖని సింగరేణి గనుల నేపథ్యంలో వీర్లపల్లి అనే ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కథను చూపించారు. కానీ ఈ కథ ఒరిజినల్ కథ అనే విషయం తాజాగా వెల్లడైంది. ఈ కథ ఎక్కడి నుంచి మీరు రాసుకున్నారు అని శ్రీకాంత్ ఓదెలను ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఈ కథ పూర్తిగా తనది కాదని అలాగే సొంతంగా క్రియేట్ చేసింది కూడా కాదని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక నిజమైన కథ తన దృష్టికి రాగా దాన్ని తాను కథగా మలుచుకున్నాను అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: Venkatesh Affairs: వెంకటేష్ పవిత్రుడేమీ కాడు.. వారితో ఎఫైర్లు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!

అంతేకాక సినిమా చూసిన తర్వాత అది ఎక్కడ జరిగిందనే విషయం మీకు కూడా ఈజీగా అర్థమయి పోతుందని శ్రీకాంత్ వదల కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాక ఈ సినిమా స్క్రిప్ట్ మీద తాను 2018 నుంచి కూర్చున్నానని షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఈ సినిమా కోసం సమయం వెచ్చించానని చెప్పుకొచ్చారు.  తన దగ్గర ఈ సినిమాకు సంబంధించిన బౌండెట్ స్క్రిప్ట్ లేదు కానీ సమయం దొరికినప్పుడల్లా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ వచ్చానని ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు.

ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని, వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటించగా సూరి అనే నాని స్నేహితుడి పాత్రను కన్నడ హీరో దీక్షిత్ శెట్టి పోషించాడు. ఇక సముద్రఖని, సాయికుమార్, ఝాన్సీ, సోనియా చౌదరి, షైన్ చాం టాకో వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఒక స్త్రీ మీద కన్నేసిన ఊరి పెద్ద ఆ స్త్రీని దక్కించుకోవడం కోసం పెళ్లయిన మొదటి రోజే ఆమె భర్తను చంపడం ఆ తర్వాత ఆ భర్త స్నేహితుడికి విషయం తెలిసి ఆ ఊరి పెద్ద బారిన ఆమె పడకుండా తాను వివాహం చేసుకోవడం వంటి కథతో ఈ సినిమాను రూపొందించారు. అయితే పూర్తిగా కథ బయట జరిగింది కాకపోయినా కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చి సినిమాని తెరకెక్కించారని చెప్పవచ్చు. ఒకవేళ మీరు గనక దసరా సినిమా చూసి ఉంటే ఆ సంఘటన ఎక్కడైనా జరిగిందేమో అని మీకు జ్ఞప్తికి వస్తే ఈ కింద కామెంట్ చేయండి. 

ఇదీ చదవండి: Tamannaah Skin Secret: బయటపడ్డ తమన్నా బ్యూటీ సీక్రెట్.. ముఖానికి ఏమి రాసుకుంటుందో తెలిస్తే యాక్ ఛీ అంటారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News