Manchu Manoj: మొదలైన మంచు మనోజ్ సెలబ్రిటీ గేమ్ షో.. ప్రోమోలో అలరించిన నాని

Ustaad: ప్రస్తుతం బుల్లితెరలో టాలీవుడ్ హీరోల షో లు తెగ అలరిస్తున్నాయి. బిగ్ బాస్ షో తో నాగార్జున అలరిస్తూ ఉంటే మరో పక్క అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ కూడా బుల్లితెర పైన సందడి చేయను వచ్చేసారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 11:21 AM IST
Manchu Manoj: మొదలైన మంచు మనోజ్ సెలబ్రిటీ గేమ్ షో.. ప్రోమోలో అలరించిన నాని

Nani: ఒకప్పుడు హీరోలు అంటే వెండితెరకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు అదే హీరోలు బుల్లితెర పైకి వచ్చేసి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. నాని.. నాగార్జున లాంటివారు బిగ్ బాస్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర పైన ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు వారి ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత మరలా ఏ సినిమాలో కనిపించలేదు మంచు మనోజ్. అంతేకాదు అప్పట్లో తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఈ హీరో ఈ మధ్యనే తన రెండో పెళ్లి చేసుకొని మళ్లీ మీడియా ముందు మెరిసారు. కాగా అప్పుడే తను మరో సినిమా కూడా త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలియజేశారు. మంచి ఫ్యామిలీ హీరో తెరపై చూసి దాదాపు 6 ఏళ్ళు అయిపోయింది. అయితే ఎన్ని సంవత్సరాల తరువాత ఈ హీరో  రీ ఎంట్రీ ఎలాంటి సినిమాతో ఇస్తారో అని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తుండగా.. బుల్లితెర షోతో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. 

మంచు మనోజ్ హోస్ట్ గా ఈ మధ్యనే ప్రకటించిన సెలబ్రిటీ గేమ్ షో ‘ఉస్తాద్’. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈ విన్’లో ఈ షో ప్రసారం కాబోతుంది. ఇక ఈ మధ్యనే ఈ షో కి సంబంధించిన కాన్సెప్ట్ వివరిస్తూ మనోజ్ తో ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ మొదటి ఎపిసోడ్ లో నాని అలరించడం విశేషం. కాగా ఈ షో మొదటి ఎపిసోడ్ లో నానితో పాటు మరో అతిథి కూడా పాల్గొనబోతున్నారు. అతిథి అంటే సెలబ్రిటీ అనుకున్నారేమో.. అసలు కాదు. నానికి వీరాభిమాని అయిన ఒక అమ్మాయి నానితో ఈ గేమ్ షో లో పాల్గొంది.

నాని తో కలిసి ఆట ఆడి.. ఇంటికి ప్రైజ్ మనీ గెలుచుకొని తీసుకు వెళ్లబోతోంది ఈ అభిమాని. కాగా తన అభిమాని గురించి చెబుతూ నాని ‘ఈమె నాకంటే ఫేమస్.. తన పేరు శ్రీ ప్రియ’ అని అందరికి పరిచయం చేశారు. ఇక ప్రోమోలో నాని అండ్ శ్రీప్రియ కలిసి గేమ్ ఆడుతున్న సన్నివేశాలను కూడా చూపించారు. ఇక ఈ ప్రోమో ఈ గేమ్ పైన ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెంచింది. కాగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 15న ప్రసారం కానుంది.

 

 

ఇక ఈ షోతో పాటు మంచు మనోజ్ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలలో ఒకతైన ‘వాట్ ది ఫిష్’ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం మధ్యలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also read: BCCI: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News