Ugly Story‌: నందు, అవికా గోర్ ల అగ్లీ స్టోరీ.. ఆకట్టుకున్న ఇంటెన్సిఫైడ్ రొమాంటిక్ థ్రిల్లర్ గ్లింప్స్

Nandu: ప్రేమ కథలు ..థ్రిల్లర్లు ఎన్నిసార్లు వచ్చినా మన తెలుగు ప్రేక్షకులు వాటిని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ రెండు జోనర్లు కలిపి రాబోతున్న సినిమా అగ్లీ స్టోరీ.. కాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటోంది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 05:36 PM IST
Ugly Story‌: నందు, అవికా గోర్ ల అగ్లీ స్టోరీ.. ఆకట్టుకున్న ఇంటెన్సిఫైడ్ రొమాంటిక్ థ్రిల్లర్ గ్లింప్స్

Avika Gor: ఇంటెన్సిఫైడ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రాబోతున్న చిత్రం 'అగ్లీ స్టోరీ' .. ఈ సినిమా గ్లింప్స్ ఈరోజు విడుదలైంది. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో..లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లు వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ మధ్యనే వధువు వెబ్ సిరీస్ లో నందు అవికా గోర్ కలిసి నటించి అందరిని మెప్పించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ థ్రిల్లర్ చిత్రంతో వెండితెర పైకి కూడా వస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ చిత్ర గ్లిమ్స్ సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ ..‘లక్కీ మీడియా రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న అగ్లీ స్టోరీ మూవీ తో 2024 హిట్టు కొట్టబోతున్నాము. నిర్మాతలు నన్ను నా కథను నమ్మి ఈ సినిమాని నిర్మించారు. వారు నాకు ఇచ్చిన సహకారంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తీశాను. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే డైలాగ్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి డైలాగులు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఇంకా ఈ సినిమాలో ఎన్నో ఉండబోతున్నాయి. 

ఈ గ్లింప్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో ముందు ముందు వచ్చే టీజర్.. ట్రైలర్.. చిత్రాన్ని ఇంకా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్నాము. అతి త్వరలో టీజర్, ట్రైలర్ తో మిమ్మల్ని కలుస్తాము. ఫస్ట్ లుక్ నుంచి మమ్మల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారు ఈ గ్లింప్స్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారు.. అలాగే మమ్మల్ని ఆదరించి మా ఈ సినిమాని ఇంకా మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాము’ అని తెలియజేశారు ఈ చిత్ర దర్శకుడు.

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x