Devil Movie: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Devil Movie: నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం 'డెవిల్'. నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2023, 03:37 PM IST
Devil Movie: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Devil Movie Release date: 'బింబిసార' సినిమాతో చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram). దాని తర్వాత 'అమిగోస్' చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈసారి ఈ నందమూరి హీరో 'డెవిల్' సినిమాతో ఆడియెన్స్ కు ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. 'బాబు బాగా బిజీ' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నవీన్. ఇప్పటికే 'డెవిల్' నుంచి రిలీజైన పోస్టర్లకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో కళ్యాణ్‌రామ్ స్వాతంత్రానికి ముందు బ్రిటీషర్లకు సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మరో హీరోయిన్ గా మాళవిక నాయర్ సందడి చేయనుంది. ఈసినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకైతే నవంబర్‌ చివరి వారంలో ఏ మూవీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకోలేదు. దీని బట్టి చూస్తే నందమూరి హీరోగా సోలోగానే వస్తున్నాడనే చెప్పాలి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా 500 మంది ఫైటర్స్ తో ఓ యాక్షన్ సీన్ కూడా చిత్రీకరించారు. ఈ మూవీకి ఈ ఎపిసోడే హైలైట్ గా నిలుస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

Also Read: Baby Movie: 'బేబీ' సినిమా మళ్లీ విడుదల.. తీసేసిన సీన్స్, సాంగ్ యాడ్ చేసిన టీం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News