Devil Movie: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌పై భారీ అంచనాలు

Devil Movie Release Date: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన మూవీ డెవిల్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 06:53 PM IST
Devil Movie: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌పై భారీ అంచనాలు

Devil Movie Release Date: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న డెవిల్ మూవీ ఈ నెల 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది.  ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనే ట్యాగ్ లైన్‌తో డెవిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి విడుద‌లైన గ్లింప్స్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్‌, డెవిల్ క్యారెక్టర్‌లో పాత్రలో తను ఒదిగిపోయిన తీరు.. లుక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ మూవీలో కళ్యాణ్ రామ్‌కు జంటగా సంయుక్తా మీనన్ యాక్ట్ చేస్తోంది. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో ఈ జోనర్‌లో సినిమా చేస్తుండడం.. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. మూవీ లవర్స్, అభిమానులు ఈ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా అని సిద్ధమైపోతున్నారు.

ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ రహాస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌ రామ్ నటిస్తున్నాడు. గతేడాది బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్‌ రామ్.. ఈసారి డెవిల్‌తో మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. మాటలు శ్రీకాంత్ విస్సా అందించగా.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా సౌంద‌ర్ రాజ‌న్ పనిచేస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలను త‌మ్మిరాజు నిర్వర్తిస్తున్నారు. 

Also Read:  Telangana New Government: కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ఎవరెవరికి ఏయే శాఖలు

Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News