Nagarjuna Shock: పేరుపేరునా కంటెస్టంట్లను కడిగిపారేసిన నాగార్జున.. ఎలిమినేషన్ షాక్ కూడా!

Nagarjuna Gave Shocks to Bigg Boss 6 Contestants about Double Elimination: శనివారం నాడు రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున అదిరిపోయే షాకులిచ్చారు. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. .

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 17, 2022, 07:05 PM IST
Nagarjuna Shock: పేరుపేరునా కంటెస్టంట్లను కడిగిపారేసిన నాగార్జున.. ఎలిమినేషన్ షాక్ కూడా!

Nagarjuna Gave Shocks to Bigg Boss 6 Contestants about Double Elimination: ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంతమంది తప్ప మిగతా వారందరూ సోషల్ మీడియా జనానికి తప్ప సాధారణ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారే అయినా సరే తెలుగు ప్రేక్షకులందరికీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు అనేక కొత్త టాస్కులతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక శనివారం నాడు నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్న సంగతి తెలిసిందే. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు వారం మొత్తం మీద జరిగిన పరిణామాలు విశ్లేషిస్తూ హౌస్ మేట్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే సరిగా ఆడని వారి భరతం కూడా పడుతూ ఉంటారు. ఇక ఈ వారం సరిగ్గా తొమ్మిది మంది బిగ్ బాస్ గేమ్ సరిగ్గా ఆడలేదని నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. బాలాదిత్య, షాని సల్మాన్, సుదీప, వాసంతి, శ్రీసత్య, రోహిత్-మరీనా, అభినయ శ్రీ, కీర్తి, శ్రీహాన్, ఇలా పేరుపేరునా ఒక్కొక్కరిని మందలిస్తూ షాక్ ఇచ్చారు.

శ్రీ సత్య విషయానికి వస్తే మీ దగ్గర బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా  అంటే ఫీల్ అవ్వలేదని ఆమె అంటుంది. దానికి అదే నీ దగ్గర తినే ప్లేట్ తీసుకుని ఉంటే ఫీలయ్యే దానివి కదా అంటూ తిండిబోతు అని అర్థం వచ్చేలా నాగార్జున కామెంట్లు చేశారు. అలాగే షానీ సాల్మన్ విషయంలో కూడా ఆయన ఘాటు కామెంట్లు చేయడంతో ఆయన నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత సుదీప విషయంలో కూడా తాను 100% ఇవ్వడానికి ట్రై చేస్తానంటే నువ్వు అలా ఇవ్వడానికి హౌస్ లో ఉండాలి కదా అంటూ ఆమెకి షాక్ ఇచ్చారు.

అభినయశ్రీ జీరో పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాను అని నా గురించి అంటే నేను ఒప్పుకోను నేను కచ్చితంగా చాలా బాగా ఆడాను అని ఆమె అంటే కనీసం 10% అయినా ఆడావా అంటూ ఆమెకు షాకిచ్చారు. అలాగే రోహిత్ మరీనా ఇద్దరి బలంతో వచ్చారని కానీ మైనస్ ఇద్దరు బలం ఉన్నట్టు ఆడుతున్నారని నాగ్ విమర్శించారు. అంతేకాదు గేమ్ సరిగ్గా ఆడని తొమిది మంది సూట్ కేసులను స్టేజ్ మీదకు తీసుకుని వచ్చి వారందరినీ హౌస్ నుంచి పంపేస్తానని కూడా నాగార్జున వార్నింగ్ ఇచ్చారు.

అలాగే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున ప్రకటించారు. ఇప్పటికే డబల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని ఎలిమినేట్ అయ్యేది మీరే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నటుడు షాని సాల్మన్ అలాగే అభినయశ్రీ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

Also Read: Thamanna Bouncers attacked: మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్లు దాడి!

Also Read: Bigg Boss 6 Eliminatation: మరో షాకివ్వబోతున్న బిగ్ బాస్.. రెండో వారంలో ట్విస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News