వైఎస్సాఆర్ పాత్రలో నాగార్జున?

దివంగత ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే.. 

Last Updated : Jan 4, 2018, 03:54 PM IST
వైఎస్సాఆర్ పాత్రలో నాగార్జున?

దివంగత ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ చిత్రాన్ని దర్శకుడు మహి వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. 

తాజాగా ఈ సినిమాలో వైఎస్ పాత్రలో అక్కినేని నాగార్జున నటిస్తున్నట్లు వార్త ఒకటి బయటికి వచ్చింది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అక్కినేని కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. అదీకాక సుమంత్, వైఎస్ జగన్ ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా. ఇద్దరూ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. నాగార్జున కూడా వైఎస్ తో సన్నిహితంగానే మెలిగారు. 

అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర బృందం దీనిపై స్పందించింది. మేము నాగ్ ను సంప్రదించలేదని పేర్కొనింది. త్వరలోనే సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారో డైరెక్టర్ చెప్తారని వెల్లడించింది. 

కాగా.. ఈ ఏడాది మహానటి సావిత్రి, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

Trending News