Nagajuna - Kubera: 'కుబేర'లో నాగార్జున లుక్‌కు టైమ్‌ ఫిక్స్..

Nagajuna - Kubera: నాగార్జున అక్కినేని రీసెంట్‌గా 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. తాజాగా ఈయన 'కుబేరా' మూవీతో పలకరించబోతున్నాడు. ఇందులో ఈయన పాత్రకు సంబంధించిన లుక్‌ను ఈ రోజు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 2, 2024, 01:05 PM IST
Nagajuna - Kubera: 'కుబేర'లో నాగార్జున లుక్‌కు టైమ్‌ ఫిక్స్..

Nagajuna - Kubera: 'బంగార్రాజు తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని  నాగార్జున.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించి నాగ్‌కు ఊపిరి ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వెంటనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ హీరోగా నటిస్తోన్న 'కుబేరా'లో నాగార్జున మరో పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నాగ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను ఈ రోజు సాయంత్రం 7.15 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా నాగార్జున ఎత్తైన భవంతిలోని ఓ కిటికీ లోంచి బయటకు చూస్తోన్న ఫోటోను చూపిస్తున్నారు. అంటే ఈ సినిమాలో కుబేరుడి పాత్రలో నాగార్జున టైటిల్ రోల్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది. అది నిజమా కాదా అనేది తెలియలంటే రాత్రి 7.15 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే.

నాగార్జున.. రీసెంట్‌గా యాక్ట్ చేసిన 'నా సామిరంగ' సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో ధనుశ్‌తో తెరను పంచుకుంటున్నాడు. ఓ రకంగా తెలుగు సీనియర్ టాప్ హీరోల్లో ఎలాంటి ఈగోలకు పోకుండా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీస్టారర్ మూవీస్‌లను ఎంకరేజ్ చేస్తున్నాడు నాగార్జున.

ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల మరో  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. నాగార్జున నటించిన 'నా సామిరంగ' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. ఈ సినిమా రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి ఓవరాల్‌గా రూ. 21.88 కోట్ల షేర్ ( రూ. 40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ యేడాది హనుమాన్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న రెండో చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది అతడే.. నా మద్దతు అతడికే: అసదుద్దీన్ ఓవైసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News