Rangamarthanda Release: రంగమార్తాండ హక్కులు కొనేసిన మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్!

Mythri Movie Makers Releasing Rangamarthanda: రంగమార్తాండ సినిమా హక్కులన్నీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్ సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది, ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 14, 2023, 09:12 PM IST
Rangamarthanda Release: రంగమార్తాండ హక్కులు కొనేసిన మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్!

Mythri Movie Makers to Release Rangamarthanda: నక్షత్రం లాంటి సినిమాతో దారుణమైన డిజాస్టర్ అందుకున్న దర్శకుడు కృష్ణవంశీ... ఆ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నట సామ్రాట్ అనే సినిమా రీమేక్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

ప్రకాష్ రాజ్, కృష్ణ వంశీ భార్య రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ ఇతర పాత్రలలో రంగమార్తాండ అనే సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఈనెల 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. 

ఇప్పటికే పలువురు సినీ ప్రేమికులకు ఈ సినిమా స్పెషల్ షోలు వేసి చూపించగా... దాదాపుగా అందరూ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. అద్భుతంగా కుదిరిందని కామెంట్లు చేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం నటన అత్యద్భుతంగా కుదిరిందని.. రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్ పాత్రలు కూడా చాలా నేచురల్‌గా వచ్చేయంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కచ్చితంగా ఈ సినిమా కృష్ణవంశీ కెరియర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించే సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆయనకు అవార్డులు కూడా సాధించి పెడుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమా హక్కులన్నీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్ సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మైత్రి మూవీ మేకర్ సంస్థ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా దిగింది.

వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన ఈ సంస్థ.. ఇప్పుడు రంగమార్తాండ హక్కులు కూడా కొనుక్కుని.. ఆ సినిమాను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా కృష్ణవంశీ మార్కుతో పాటు ప్రకాష్ రాజు నటన, రమ్యకృష్ణ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవబోతున్నారు. బ్రహ్మానందం పాత్ర కూడా సినిమాకు ప్లస్‌ అవుతుందని...  ఇళయరాజా సంగీతం, చిరంజీవి పాడిన షాయరీ కూడా సినిమాకి ప్లస్ అవ్వబోతున్నాయని అంటున్నారు.

Also Read: Dasara Trailer Launch: నాని 'దసరా' ట్రైలర్ వచ్చేసింది.. 5 నిమిషాల్లోనే 20 వేల వ్యూస్! ఆలస్యం ఎందుకు

Also Read: ‘The Elephant Whisperers’ on OTT: ఆస్కార్ గెలిచిన ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News