Aryan Khan's bail plea: ఆర్యన్ ఖాన్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న Mumbai Court

Mumbai cruise drugs case live updates: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయి ఇప్పటికే 18 రోజులు గడిచిపోయింది. గత పద్దెనిమిది రోజులుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో (Aryan Khan in Arthur Road prison) ఆర్యన్ కాలం వెళ్లదీస్తున్నాడు.

Written by - Pavan | Last Updated : Oct 20, 2021, 04:23 PM IST
Aryan Khan's bail plea: ఆర్యన్ ఖాన్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న Mumbai Court

Mumbai cruise drugs case live updates: ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కి మరోసారి ముంబై స్పెషల్ కోర్టులో చుక్కెదురైంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ముంబై ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌‌పై ఆర్డర్‌ని రిజర్వ్ చేసిన ముంబై స్పెషల్ కోర్టు.. నేడు ఆ పిటిషన్‌ని తిరస్కరిస్తున్నట్టు స్పష్టంచేసింది. దీంతో ఆర్యన్ ఖాన్‌కి మరోసారి బెయిల్ విషయంలో నిరాశ తప్పలేదు. అక్టోబర్ 3న ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయి ఇప్పటికే 18 రోజులు గడిచిపోయింది. గత పద్దెనిమిది రోజులుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో (Aryan Khan in Arthur Road prison) ఆర్యన్ కాలం వెళ్లదీస్తున్నాడు. గత వారం చివరిసారిగా ఆర్యన్ ఖాన్ పెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై ప్రత్యేక ముంబై కోర్టు తన ఆర్డర్‌ని రిజర్వ్ చేసింది. దీంతో నేటి వరకు కోర్టు ఏం చెబుతుందా అనే ఎదురుచూపులు ఆర్యన్ ఖాన్‌కి తప్పలేదు. 

Also read : Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్

ఆర్యన్ ఖాన్‌ని అరెస్ట్ చేసినప్పుడు అతడి వద్ద నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోనందున అతడిపై నమోదైన కేసులోనే పస లేదని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, ఆర్యన్ ఖాన్ లాంటి వాళ్లు జైలు నుంచి బెయిల్‌పై బయటికొస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

ఆర్యన్ ఖాన్‌ని ఇంకొన్ని రోజులు కస్టడీకి అప్పగిస్తే.. అతడి నుంచి డ్రగ్స్ సరఫరాదారులకు (Drugs peddlers) సంబంధించిన సమాచారం రాబట్టవచ్చని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీబీ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ని (Aryan Khan's bail plea live updates) కొట్టివేసింది.

Also read : Salaar fighting scene leaked: సలార్ ఫైటింగ్ సీన్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Also read : Radhe Shyam teaser: ప్రభాస్.. రాధేశ్యామ్‌ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

Trending News