ముద్దమందారం, 30 జులై, పూర్తి ఎపిసోడ్:  అఖిలాండేశ్వరి ప్రవర్తనపై దేవా, పార్వతికి అనుమానం

మీ అభిమాన ZEE తెలుగులో మీరు మెచ్చిన, మనసుకు నచ్చిన చక్కటి ముద్దమందారం సీరియల్‌

Last Updated : Jul 31, 2018, 05:13 PM IST
ముద్దమందారం, 30 జులై, పూర్తి ఎపిసోడ్:  అఖిలాండేశ్వరి ప్రవర్తనపై దేవా, పార్వతికి అనుమానం

మీ అభిమాన ZEE తెలుగులో మీరు మెచ్చిన, మనసుకు నచ్చిన చక్కటి ముద్దమందారం సీరియల్‌లో ఈ ఎపిసోడ్‌లో సరికొత్త మలుపు తిరిగిన కథ ఇది. ఓవైపు అఖిలాండేశ్వరిని కిడ్నాప్ చేసి ఆమె స్థానంలోకి వచ్చిన చాముండేశ్వరి, ఏ క్షణం ఏం చేస్తుందో అనే ఉత్కంఠతో కథ నడుస్తుంటే, దేవా, మహిలు అఖిలాండేశ్వరికి మద్దతు ఇవ్వకుండా సరికొత్త పన్నాగం పన్నుతారు. పార్వతి విషయంలో అఖిలాండేశ్వరికి సపోర్ట్ చేయకుండా ఉండడానికి దేవా, మహిలు భవానితో తెల్లకాగితంపై సంతకం చేయించుకుంటారు. తర్వాత, అవి విడాకుల పత్రాలు అని చెప్పి ఆమెను ఆటపట్టిస్తారు. 

 

మరోవైపు, అఖిలాండేశ్వరిలో వచ్చిన అనూహ్య మార్పుకు కారణమేంటోనని దేవా ఆలోచిస్తుండగా పార్వతి, ఆమెను ఎవరైనా హిప్నటైజ్ చేసి ఉంటారా అని అనుమానిస్తుంది. ఇదిలాఉండగా, మోడెర్న్ దుస్తులలో నడుచుకుంటూ వస్తున్న అఖిలాండేశ్వరిని చూసి శివశంకర్ తనకు నచ్చలేదని మొహం మీదే చెబుతాడు. తర్వాత, పార్వతి దేవా గదికి వెళ్లకూడదని అఖిలాండేశ్వరి షరతు పెడుతుంది. అసలేం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్ధితుల్లో ఉత్సుకతతో సాగుతున్న ముద్దమందారం ఎప్పటిలానే టాప్ రేటింగ్‌‌లో వుంది. ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5 ఎపిసోడ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News