Mike Tysons poster from Liger : దీపావళి స్పెషల్ గా “లైగర్” నుంచి మైక్ టైసన్ లుక్ రిలీజ్

Mike Tyson’s first look poster from Liger out: ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Unique Pandey) హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ (Mike Tyson) నటిస్తుండటంతో లైగర్ కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 03:27 PM IST
  • లైగర్ మూవీ నుంచి మైక్ టైసన్ పోస్టర్
  • ఫుల్ యాక్షన్ మోడ్ లో ఇంటెర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్
  • విజయ్‌ దేవర కొండ ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం
 Mike Tysons poster from Liger : దీపావళి స్పెషల్ గా “లైగర్” నుంచి మైక్ టైసన్ లుక్ రిలీజ్

Mike Tyson’s first look poster from Puri Jagannadh and Vijay Deverakondas Liger out: యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఎంతో నచ్చనున్న లైగర్ (Liger) మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తోన్న ఈ మూవీ.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh ) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Unique Pandey) హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ (Mike Tyson) నటిస్తుండటంతో లైగర్ కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. 

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీలో థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, (Charmi) కరణ్ జోహర్, (Karan Johar) అపూర్వ మెహతా కలిసి లైగర్ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. లైగర్ మూవీని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. 

Also Read : Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??

దీపావళి సందర్భంగా ‘లైగర్’ మూవీ యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో ఇంటెర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. మైక్ టైసన్ కు (Mike Tyson) సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ అప్‌ డేట్ తో విజయ్‌ దేవర కొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

 

ఇక విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ చిత్రంలో డ్యాన్స్ చేయ‌నున్నాడ‌ట‌. ఈ మూవీలో విజయ్ ఒక బాక్సర్‌గా కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమైంది. అయితే లైగర్ (Liger) సినిమాలో వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్న విషయాలు ఇంకా ఏమీ తెలియదు. 

Also Read : Modi Diwali Celebrations: సైనికులతో ప్రధాని దీపావళి సంబరాలు, దేశానికి సైన్యమే సురక్షా కవచమన్న మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News