Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!

Mehabooba Song Video: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ చిత్రం ఇటీవలే థియటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సంపాందించుకుంది. ఇప్పుడీ సినిమాలోని మెహబూబా సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 12:07 PM IST
Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!

Mehabooba Song Video: కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీని సృష్టిస్తోంది. హిందీ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'కేజీఎఫ్ 2' మూవీ నిలిచింది. కలెక్షన్స్ లో ఇప్పటికే రూ. 1,100 కోట్ల మార్క్ ను 'కేజీఎఫ్ 2' దాటేసింది. 

'కేజీఎఫ్ 2' మూవీ విడుదలై దాదాపుగా నెల గడుస్తున్న క్రమంలో ఈ సినిమాలోని సాంగ్ వీడియోస్ ను చిత్రబృందం రిలీజ్ చేస్తోంది. ఇటీవలే 'ఎదగరా ఎదగరా' వీడియో సాంగ్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ 'మెహబూబా' ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. 

ఈ చిత్రంలో యష్, శ్రీనిధి శెట్టితో పాటు బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తో పాటు రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. హోంబళే ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి విజయ్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. 

Also Read: Sarkaru vaari paata : సీఎం జగన్ గురించి సూపర్ స్టార్ మహేష్ ఏమనుకుంటున్నారంటే..

Also Read: Mahesh-Rajamouli Movie Update: జక్కన్నతో మహేశ్ సినిమా కధ నేపధ్యమేంటి, ఎప్పుడు సెట్స్‌పై రానుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News