టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది పండుగను పురస్కరించుకుని తొలుత మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు తెరిచి అభిమానులకు మరింత చేరువకాగా, ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం తండ్రి బాటలోనే పయనించాడు. చెర్రీ సైతం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు (Happy Birthday Ram Charan). కుమారుడి బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్ Pawan Kalyan స్ఫూర్తితో రామ్ చరణ్ విరాళం
I was naturally overjoyed when @AlwaysRamcharan was born.Much later it occurred to me there was perhaps a reason why he was born on 27th March #WorldTheatreDay ‘Prapancha‘Rangasthala’dinotsavam’! He took to acting like a fish to water.On this eve,Many Many Happy Returns #Charan! pic.twitter.com/H38AflKwGi
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020
రామ్ చరణ్ పుట్టినప్పుడే చాలా చాలా సంతోషించాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం (#WorldTheatreDay) రోజున పుట్టిన కారణంగా ఆ సంతోషం రెట్టింపయిందనుకుంటా. నీళ్లలో చేప ఎంత తేలికగా ఈదగలదో రామ్ చరణ్‌కు నటన కూడా అంతే. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి చరణ్’ అని ఆకాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌కు విషెస్ తెలిపారు. రామ్ చరణ్ చిన్ననాటి ఓ అరుదైన ఫొటోను చిరు పోస్ట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RRR ఫ్యాన్స్‌కు ఉగాది కానుక.. రౌద్రం.. రుధిరం.. రణం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తన వంతుగా రూ.70లక్షలు విరాళం ప్రకటనను ట్విట్టర్‌లో తొలి పోస్ట్ చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. తన బాబాయ్ ఈ విషయంలో తనకు స్ఫూర్తి అని సైతం రామ్ చరణ్ ప్రకటించడం అతడంటే ఏంటన్నది మరోసారి నిరూపించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
రామ్ చరణ్ బర్త్ డే.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు