Megastar Chiranjeevi Emotional: రాజావారు రాజావారు అని పిలిచేరు...మహావృక్షం నేలకొరిగింది!

Megastar Chiranjeevi Emotional Words on Death of Krishnam Raju: బల్ స్టార్ కృష్ణం రాజు పార్థివ దేహాన్ని మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా దుర్దినమన్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 11, 2022, 02:20 PM IST
Megastar Chiranjeevi Emotional: రాజావారు రాజావారు అని పిలిచేరు...మహావృక్షం నేలకొరిగింది!

Megastar Chiranjeevi Emotional Words on Death of Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు పార్థివ దేహాన్ని మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా దుర్దినం అని, ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. ఆయన గతంలో చాలా సార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు, ఆస్పత్రికి వెళ్ళిన ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చారని, ఈసారి కూడా ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకున్నానని ఆయన పేర్కొన్నారు.

ఆయన తిరిగి రారు అని ఎవరూ ఊహించలేదని అన్నారు. మొగల్తూరులో  చిన్నపుడు ఆయనను  చూడటం కోసం ఎగబడిన  వాళ్ళలో నేను ఉన్నానని, ఇంకా ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉందని అన్నారు. ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేదన్న చిరు రావు గోపాల్ రావు లాంటి వాళ్లు రాజావారు రాజావారు అని పిలిచేవారని అన్నారు. కృష్ణంరాజు మహావృక్షం లాంటివారు ఈరోజు ఆ మహావృక్షం నేలకొరిగిందని, ఆయన పరిపూర్ణమై జీవితాన్ని అనుభవించారని అన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరు పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ హీరోలు  వెంక‌టేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు, నాని, ఎన్ఠీఆర్ తో పాటు ప‌లువురు హీరోలు కృష్ణంరాజు నివాసానికి వెళ్లి సందర్శించారు. ఇక మరి కాసేపట్లో సీనియర్ నటుడు కృష్ణంరాజు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ సందర్శించి నివాళులు అర్పించనున్నారు. తాజా సమాచారం ప్రకారం కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరగనున్నాయి. కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఈరోజు మధ్యాహ్నం కోట్ల విజయ్ భాస్కర రెడ్డి స్టేడియంకు తరలించనున్నారు. ఇక రేపు ఫిలిం ఛాంబర్ వద్ద పార్థివదేహాన్ని కొంత సేపు ఉంచి అక్కడి నుంచి మహా ప్రస్థానానికి తరలించబోతున్నారు. 
 Also Read: Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్

Also Read: Allu Arjun -Krishnam Raju: కృష్ణంరాజు చనిపోతే అదేమి ట్వీట్.. తగ్గేదేలేదంటారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News