Ram Charan and Nani: మైసూర్‌ ఆలయంలో చరణ్‌ పూజలు.. కడప దర్గాలో నాని ప్రార్థనలు..

Ram Charan and Nani: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని, నేచురల్ స్టార్ నాని కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. వీరిని చూడటానికి అభిమానులు పోటెత్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 12:15 PM IST
Ram Charan and Nani: మైసూర్‌ ఆలయంలో చరణ్‌ పూజలు.. కడప దర్గాలో నాని ప్రార్థనలు..

Ram Charan and Nani: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని (Sri Chamundeshwari temple ) దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం చిత్రయూనిట్ తో కలిసి చరణ్ ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కడప దర్గాకు నాని..
మరోవైపు నేచురల్ స్టార్ నాని కడప దర్గాను సందర్శించారు. 'హాయ్ నాన్న' మూవీ (Hi Nanna) ప్రమోషన్స్ లో భాగంగా.. కడపకు వెళ్లిన నాని అక్కడ పెద్ద దర్గాను సందర్శించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నానిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కడప దర్గాలో(Kaapa Dargha) మెుక్కు ఉందని.. అది తీర్చుకోవడానికే ఇక్కడకు వచ్చానని నాని అన్నారు. గతంలో కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ స‌మయంలో కూడా నాని కడప ద‌ర్గాను సందర్శించారు. ప్రస్తుతం నాని నటించిన హాయ్ నాన్న మూవీ డిసెంబరు 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్.  శౌర్యువ్  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల చేయనున్నారు. 

Also Read:Bigg Boss 07 Telugu: బిగ్ బాస్ నుంచి డాక్టర్ బాబు ఎలిమినేట్.. శివాజీతో గొడవే కారణమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News