Maa Elections 2021: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం..పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం!

Manchu Vishnu: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. అనంతరం తొలి సంతకం పెన్షన్ల ఫైలుపై పెట్టారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 12:39 PM IST
  • పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు
  • నరేశ్ నుండి బాధ్యతల స్వీకరణ
  • హాట్ టాఫిక్ గా కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం
Maa Elections 2021: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం..పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం!

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు(Manchu Vishnu)  ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలు(Pensions File)పై తొలి సంతకం చేశారు. నరేష్(Naresh) నుండి బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి కొత్త 'మా' అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టారు. 

కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్(Prakash Raj  panel) నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త కమిటీ  ప్రమాణ స్వీకారం ఎప్పుడూ ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద మనుషుల ద్వారా సర్ది చెప్పించి.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను కలుపుకుపోతారా లేక.. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా కొత్తవాళ్లని వారి ప్లేసుల్లో రిప్లేస్ చేస్తారా అన్నది చూడాలి.

Also read: Manchu Vishnu: చిరంజీవి, రామ్ చరణ్ గురించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

విష్ణు మ్యానిఫెస్టోలోని అంశాలు: 
1. 'మా'లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘'MAA APP'’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్‌ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తాం!
2. తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘'మా'’ భవన నిర్మాణం.
‘3. 'మా' లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. '‘మా’' సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు.
4. ‘జాబ్‌ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీ వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం!
5. అర్హులైన 'మా' సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం.
‘6. 'మా' మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణకోసం హైపవర్‌ కమిటీ
7. గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్‌ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం.
8. అర్హులైన 'మా'  సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం.
9. కొత్తగా 'మా' మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం
10. ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టడానికి ఒక కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు
‘11. 'మా' ’సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా 50శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ.
12. అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్‌ అందేలా చర్యలు. అలాగే రూ.6000 పెన్షన్‌ గణనీయంగా పెంచే ఏర్పాటు
13. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి.
14. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చలన చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం!

Also Read: MAA elections: జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికల్లో ఓటేయలేదు: Manchu Vishnu

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News