Kannappa: డిసెంబర్ లో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వెనక మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా..

Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఈ  రిలీజ్ డేట్ వెనక ఉన్న స్ట్రాటజీ అదేనా.. ? అని సినీ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 19, 2024, 11:13 AM IST
Kannappa: డిసెంబర్ లో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వెనక  మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా..

Kannappa  Release Date :డిసెంబర్ లో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వెనక  మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా..  అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ గా డిసెంబర్ ను పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తన కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే.. డిసెంబర్ లో అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప’ డిసెంబర్ 6న  రిలీజ్  చేస్తున్నట్టు ప్రకటించారు.  అయితే ఆ డేట్ లో ఈ సినిమా విడుదల అవుతుందన్న గ్యారంటీ లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 2025 సమ్మర్  కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ అంతా సాఫీగా సాగితే.. డిసెంబర్ 6న విడుదలైన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

ఒకవేళ పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే.. ఆ రిలీజ్ డేట్ లోనే కన్నప్పను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ పుష్ప 2 అనుకున్న సమయానికి వస్తే.. డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు కన్నప్పను బాహుబలి మాదిరే భారీ స్కేల్ తో నిర్మిస్తున్నట్టు టీజర్ చూస్తూ అర్థమవుతోంది.  ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేయడం ఈ సినిమాకు ప్లస్ కానుంది. ప్రభాస్ ఫేస్ తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా దక్కడం గ్యారంటీ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు 20 నిమిషాలకు పైగా పొడిగించినట్టు సమాచారం. ఈ సినిమాను మంచు విష్ణుతో  స్నేహంతో పాటు తన పెదనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’కు రీమేక్ గా తెరకెక్కుతోంది. మరోవైపు పెదనాన్న ప్రభాస్ ను కన్నప్పలో నటింపచేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. అందుకే మంచు విష్ణు ఈ సినిమాలో పాత్ర ఆఫర్ చేయగానే ఎలాంటి మెహమాటం లేకుండా డార్లింగ్ ఓకే అనేసాడు. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదట.
 
ఈ చిత్రంలో ప్రభాస్ కాకుండా ఇతర ముఖ్యపాత్రల్లో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శ రత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, బ్రహ్మానందం, నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, భారతీయ వెండితెర మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రాబోతుంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News