Bhuma Mounika Cried: మనోజ్ పెళ్లికి మోహన్ బాబు.. తట్టుకోలేక ఏడ్చేసిన భూమా మౌనిక?

Bhuma Mounika Cries after Seeing Mohan Babu: మంచు మోహన్ బాబు తన రెండవ కుమారుడు రెండో వివాహానికి హాజరై తన దీవెనలు కొత్తజంటకు అందించారు. ఆయన దీవిస్తున్న సమయంలో భూమా మౌనిక రెడ్డి ఎమోషనల్ అవుతూ కంట కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 3, 2023, 11:26 PM IST
Bhuma Mounika Cried: మనోజ్ పెళ్లికి మోహన్ బాబు.. తట్టుకోలేక ఏడ్చేసిన భూమా మౌనిక?

Mohan Babu attends to Manoj Marriage: చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేస్తూ మంచు మనోజ్ తాను ప్రేమించిన భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేశారు. శుక్రవారం రాత్రి ఫిలింనగర్ లోని మంచు నివాసంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహం మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని అందుకే వివాహానికి ఆయన హాజరు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు మంచు మోహన్ బాబు తన రెండవ కుమారుడు రెండో వివాహానికి హాజరై తన దీవెనలు కొత్తజంటకు అందించారు. ఇక ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు దీవిస్తున్న సమయంలో భూమా మౌనిక రెడ్డి ఎమోషనల్ అవుతూ కంట కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ మొదట ప్రణత రెడ్డి అనే ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ విడిపోయారు. మరోపక్క భూమా మౌనిక రెడ్డి కూడా భూమా నాగిరెడ్డి కుమార్తెగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా తండ్రి ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ తో ఆమె వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వారిద్దరికీ కూడా విడాకులు అయ్యాయి. ఈ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక రెడ్డి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ తమ తమ పెద్దలను ఒప్పించి తమ రెండో వివాహం ఘనంగా చేసుకున్నారు. ఇక ఈ వివాహం మొత్తాన్ని తన చేతుల మీదుగా నడిపించింది మంచు లక్ష్మి. మంచు మనోజ్ వివాహం లో ప్రతిఘటంలోనూ ఆమె కనిపించారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఇక మంచు విష్ణు ఈ వివాహానికి హాజరయ్యారు కానీ కొద్దిసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఒక ప్రచారమే కాగా ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. 

Also Read: Manchu Vishnu: తమ్ముడు పెళ్లికి అతిథిగా వచ్చి వెళ్లిపోయిన మంచు విష్ణు..టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ!

Also Read: Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News