Manchu Manoj Whatsapp chat : వాట్సప్ చాట్ బయటపెట్టేసిన మంచు మనోజ్.. అంతా డబుల్ మీనింగ్.. వెన్నెల కిషోర్‌ చాటింగ్ వైరల్

Manchu Manoj Shares Whatsapp chat మంచు మనోజ్ తాజాగా వాట్సప్ చాట్‌ను బయటపెట్టేశాడు. అందులో వెన్నెల కిషోర్‌తో కలిసి మంచు మనోజ్ పెట్టిన ముచ్చట్ల గురించి ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 09:37 AM IST
  • సోషల్ మీడియాలో హీరో, కమెడియన్ సందడి
  • వాట్సప్ చాటింగ్‌లో వెన్నెల కిషోర్, మనోజ్ హల్చల్
  • చాటింగ్ బయటపెట్టేసిన మంచు మనోజ్‌పై నెటిజన్ల కౌంటర్లు
Manchu Manoj Whatsapp chat : వాట్సప్ చాట్ బయటపెట్టేసిన మంచు మనోజ్.. అంతా డబుల్ మీనింగ్.. వెన్నెల కిషోర్‌ చాటింగ్ వైరల్

Manchu Manoj Shares Whatsapp chat  మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ట్రోలింగ్‌తో విష్ణు, మంచు లక్ష్మీలు ట్రోల్స్ అవుతుంటారు. కానీ మంచు మనోజ్ మీద ఎక్కువగా ట్రోలింగ్ జరగదు. అతని మీద మంచి పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య మనోజ్ మీద కూడా నెగెటివ్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. నాగబాబు గురించి పరోక్షంగా మాట్లాడుతూ హయ్యర్ పర్పస్ అంటూ చేసిన కామెంట్ల తరువాత ఇలా నెగెటివ్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది.

అయితే ఇప్పుడు మంచు మనోజ్ రెండో పెళ్లి మీద రకరకాల రూమర్లు వస్తున్నాయి. భూమా మౌనికా రెడ్డితో మంచు మనోజ్ పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటిపై మంచు మనోజ్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అలా అని ఖండించనూ లేదు. తాజాగా మంచు మనోజ్ వేసిన పోస్ట్ అందరినీ నవ్వించేస్తోంది.

 

నాది, నీది అంటూ ఇలా డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుకున్నారు. నాది ఆగ్రాలో ఉంది.. మీది ఎక్కడ ఉంది చిచ్చా.. అని మనోజ్ అనడం.. నాది హైద్రాబాద్‌లో ఉంది అని కిషోర్ రిప్లై ఇవ్వడం ఇందులో కనిపిస్తోంది. వచ్చాక మీకి టైం ఇస్తే మీద కలుస్త నాది అని మనోజ్ అన్నాడు. హహహహ డన్ డన్ అని వెన్నెల కిషోర్ రిప్లై ఇచ్చాడు.

మచ్చా నీది హైద్రాబాద్‌కి వచ్చిందా? అని వెన్నెల కిషోర్ అడగడం.. 22 రాత్రికి వస్తుంది నాది.. లొకేషన్ మార్చింది.. సో నాది బాన్సువాడ వచ్చింది.. వచ్చింది వచ్చింది.. మీకి కలిసింది నాది.. అని మనోజ్ అన్నాడు. నాది ఎదురుచూస్తుంది నీది కోసం మని జిఫ్ ఫైల్‌ను షేర్ చేశాడు వెన్నెల కిషోర్. ఇక వీరి భాషను చూసుకుని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. నువ్వు కూడా ఇలా తయారయ్యావేంటి అన్నా అని మనోజ్ మీద కామెంట్లు చేస్తున్నారు.

Also Read : Bigg Boss 6 Telugu Winner : గెలిచినా ఓడినట్టు చేసిన నాగార్జున.. రేవంత్‌కు క్షణాల్లో ఆనందం ఆవిరి.. ఓడినా గెలిచేసిన శ్రీహాన్

Also Read : Janhvi Kapoor Photoshoot : పొంగి పొర్లుతున్న ఎద అందాలు.. వామ్మో అనిపిస్తోన్న జాన్వీ కపూర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News