Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Manchu Manoj And Manchu Vishnu Disputes మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్‌కు సన్నిహితుడైన సారథి అనే వ్యక్తిపై మంచు విష్ణు చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 11:40 AM IST
  • మంచు వారింట్లో గొడవలు
  • వీధిన పడ్డ భాగోతం
  • మంచు మనోజ్ ఇంటిపై దాడి
Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Manchu Manoj And Manchu Vishnu Disputes మంచు వారింట్లో గొడవలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తాడంటూ విష్ణు విజువల్స్‌ను మనోజ్ షేర్ చేశాడు.

 

అయితే ఈ విజువల్స్‌లో మంచు విష్ణు కనిపించాడు. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అని విష్ణు అరుస్తున్నాడు. విష్ణుని అందరూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ తన అన్న గురించి వీడియోను షేర్ చేశాడు మంచు మనోజ్.

మంచు వారింట్లో ఇలాంటి ఏదో జరుగుతోందనే రూమర్లు ఇది వరకు వచ్చాయి. మంచు సోదరుల మధ్య మంచి బంధాలు లేవనే టాక్ వస్తూనే ఉంది. మంచు మనోజ్ గురించి మాట్లాడను.. అది వాడి పర్సనల్ అంటూ ఆ మధ్య ఓ సారి మంచు విష్ణు అన్నాడు. ఎవ్వరికీ తాను సలహాలు ఇవ్వను అంటూ తన తమ్ముడి గురించి పరోక్షంగా స్పందించాడు విష్ణు.

మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లిలోనూ మంచు విష్ణు కనిపించలేదు. అలా వచ్చి ఇలా వెళ్లినట్టు ఉన్నాడు. కానీ మంచు వారి సంబరాలు, వారి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా కూడా మంచు విష్ణు కనిపించలేదు. అప్పుడే అందరికీ కన్ఫామ్ అయింది. ఇలాంటి గొడవలేవో జరుగుతున్నాయని అంతా అనుకున్నారు. ఇప్పుడిలా వారంతటా వారే రోడ్డున పడ్డారు.

వీరిద్దరి మధ్య ఎంతో కాలం నుంచి గ్యాప్ మెయింటైన్ అవుతూనే ఉంది. మా ఎన్నికల్లోనూ ఎక్కువ యాక్టివ్‌గా లేడు. మంచు ఫ్యామిలీతో అంటీ అంటనట్టుగానే ఉంటున్నాడు మంచు మనోజ్. ఇక అక్క మంచు లక్ష్మీతో మాత్రం మనోజ్ బాగానే ఉంటున్నాడు. ఈ రెండో పెళ్లిని సైతం మంచు లక్ష్మే ముందుండి నడిపించినట్టు తెలుస్తోంది.

మంచు విష్ణు పవన్ కళ్యాణ్‌ మధ్య కోల్డ్ వార్ జరిగిన సమయంలోనూ.. మంచు మనోజ్ కొత్త స్టాండ్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మంచు విష్ణు కామెంట్లు చేయడం, ఆ టైంలో మంచు విష్ణుని తెగ ట్రోల్ చేయడం అందరికీ తెలిసిందే. గొడవ అలా పెరుగుతూ ఉంటే.. సద్దుమణిగేలా చేసేందుకు పవన్ కళ్యాణ్‌ను పర్సనల్‌గా వెళ్లి కలిశాడు మనోజ్. అయితే అప్పుడు అన్న కోసం వెళ్లాడా? లేదా ఇంకేదైనా కారణమై ఉంటుందా? అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.

అయితే అసలు ఈ గొడవలు భూమా మౌనిక వల్లే ఏర్పడ్డాయా? లేదా మంచు వారి అంతర్గత విషయాలు, ఆస్తుల వల్ల జరిగిందా? అన్నది తెలియడం లేదు. అసలే మంచు విష్ణు భార్య విరానిక రెడ్డి జగన్ బంధువు. భూమా మౌనిక టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి. ఇలా ఇంట్లోనే రెండు ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులున్నారు. ఈ గొడవల్లో ఏమైనా రాజకీయ హస్తం ఉందా? అన్నది కూడా తెలియడం లేదు.

Also Read:  Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!

Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News