Salaar movie: సలార్ మూవీలో కన్పించబోతున్న మోహన్ లాల్

Salaar movie: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకెక్కనుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ మూవీలో మరో ప్రముఖ నటుడు కన్పించబోతున్నాడు. ప్రభాస్‌కు దీటుగా ఆ నటుడి పాత్ర డిజైన్ జరుగుతోంది ప్రస్తుతం.

Last Updated : Dec 15, 2020, 04:15 PM IST
  • సలార్ మూవీలో నటించబోతున్న మోహన్ లాల్
  • కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ సినిమా
  • ప్రభాస్ హీరోగా సలార్ త్వరలో షూటింగ్ ప్రారంభం
Salaar movie: సలార్ మూవీలో కన్పించబోతున్న మోహన్ లాల్

Salaar movie: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకెక్కనుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ మూవీలో మరో ప్రముఖ నటుడు కన్పించబోతున్నాడు. ప్రభాస్‌కు దీటుగా ఆ నటుడి పాత్ర డిజైన్ జరుగుతోంది ప్రస్తుతం.

బాహుబలి ( Bahubali ) ఫేమ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ( Rebel star Prabhas ) వరుస సినిమాలతో షెడ్యూల్ బిజీగా మారింది. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ ( Radhrshyam shooting ) జరుగుతోంది. అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో మూవీ ఒప్పుకున్నాడు. ఇంకోవైపు బాలీవుడ్ డైరెక్టర్‌తో ఆదిపురుష్ ( Adipurush ) సెట్స్ పైకెక్కనుంది. ఇక ఈ సినిమాలకు తోడు దేశవ్యాప్తంగా సంచలన హిట్ కొట్టిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా సలార్ ( Salaar ) తెరకెక్కనుంది.

ఇప్పటికే సలాన్ టైటిల్ ఫిక్స్ చేస్తూ విడుదలైన ఫస్ట్‌లుక్ ( Salaar first look ) సంచలనంగా మారింది. టైటిల్ ప్రకటితమైనప్పటి నుంచి సలార్‌పై అంచనాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. కేజీఎఫ్ 2  Kgf 2 ) చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ( Prashant neel )..ఆ సినిమా తరువాత సలార్ ను తెరకెక్కించనున్నాడు. సలార్ మూవీలో మరో ప్రముఖ నటుడు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ కన్పించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ పాత్రకు దీటుగా మోహన్ లాల్ పాత్ర ( Mohan lal )ను ప్రశాంత్ నీల్ స్వయంగా డిజైన్ చేస్తున్నాడట. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన మోహన్ లాల్..సలార్‌లో నటిస్తున్నారని తెలియడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. Also read: VJ Chithra Suicide case: విజే చిత్ర మృతి కేసులో హేమంత్ అరెస్ట్.. చిత్ర ఆత్మహత్యకు కారణం అదేనా ?

Trending News