Mahesh Babu's Astrology: మహేష్ బాబు జాతకం వల్లనే వరుస మరణాలు.. అసలు విషయం చెప్పిన వేణుస్వామి!

Mahesh Babu Brother Mother and Father Death Reason: మహేష్ బాబు జాతకం వల్లనే ఆయన సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ మరణించారని వెల్లడించారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆ వివరాలలోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 25, 2022, 01:03 PM IST
Mahesh Babu's Astrology: మహేష్ బాబు జాతకం వల్లనే వరుస మరణాలు.. అసలు విషయం చెప్పిన వేణుస్వామి!

Mahesh Babu Brother Mother and Father Death Reason: ఒకే ఏడాది సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో మూడు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకరకంగా మహేష్ బాబు అయితే తీవ్ర విషాదంలో మునిగిపోగా ఇప్పుడిప్పుడే ఆయన ఆ బాధ నుంచి బయట పడుతున్నారు.

అయితే ఇలా వరుస విషాద సంఘటనలు చోటు చేసుకోవడం వెనుక జాతక రీత్యా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అంటూ తాజాగా వేణు స్వామి అనే ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అదంతా మహేష్ బాబు జాతకం వల్లే అంటూ ఆయన కామెంట్స్ చేశారు. తాను 2016- 17 సంవత్సరాల వరకు అన్ని కార్యక్రమాలు తన చేతుల మీదే జరిగేవని ఎక్కువగా పద్మాలయ స్టూడియోస్ లోనే తాను ఉండేవాడినని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

అయితే ఒక వినాయక చవితి సంధర్భంగా జాతకం ఎలా ఉందో చూసి చెప్పమని విజయనిర్మల అడిగితే తాను చూసి 2020 తర్వాత ఈ ఇంట్లో వరుస మరణాలు సంభవిస్తాయని చెప్పానని అప్పటివరకు ఏ చిన్న కార్యక్రమం అయినా నా చేతుల మీదే జరిపించే విజయనిర్మల అప్పటి నుంచి తనను దూరం పెట్టారని వేణు స్వామి వెల్లడించారు. అలాగే మహేష్ బాబు జాతక రీత్యా శని, గురు మారుతూ ఉన్నారని ఆ ఎఫెక్ట్ వల్ల కూడా అది తండ్రి ఆరోగ్యం మీద తల్లి ఆరోగ్యం మీద పడిందని వేణు స్వామి వెల్లడించారు.

మహేష్ బాబుది సింహరాశి అని పేర్కొన్న వేణు స్వామి ఆ రాశి గల వాళ్లకు రాబోయే జనవరి నుంచి తల్లి తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని, మహేష్ బాబు సింహరాశిలో పుట్టి ఉండటం వల్లే ఆయన తల్లి తండ్రి వరుసగా మరణించి ఉండవచ్చని కూడా వేణు స్వామి అభిప్రాయపడ్డారు.
Also Read: పెళ్లి చేసుకోమని ఒత్తిడి, ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు.. ఏడు నెలల తరువాత బయటపడి!

Also Read: Balakrishna: బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News