SSMB 28 Title : ఇదేం టైటిల్‌రా అయ్యా?.. మహేష్‌ త్రివిక్రమ్ మూవీపై ట్రోల్స్

SSMB 28 Title మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన టైటిల్ విషయం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఈ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇది కూడా త్రివిక్రమ్ సెంటిమెంట్‌ ఫాలో అయి పెట్టినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 01:43 PM IST
  • మహేష్‌ బాబు సినిమాకు టైటిల్
  • మళ్లీ త్రివిక్రమ్ సెంటిమెంట్‌
  • అమ్మకథ టైటిల్ ఫిక్స్ అయినట్టే?
SSMB 28 Title : ఇదేం టైటిల్‌రా అయ్యా?.. మహేష్‌ త్రివిక్రమ్ మూవీపై ట్రోల్స్

Mahesh Babu Trivikram Amma Katha మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న SSMB 28 సినిమాకు అమ్మకథ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అమ్మ కథ అనే టైటిల్‌ కాస్త వెరైటీగా ఉందని జనాలు అభిప్రాయ పడుతున్నారు. అమ్మ కథనా? ఎవరి అమ్మ కథ? సొంత అమ్మనా?.. సవితి అమ్మనా? అసలే సినిమా కథ ఏంటి? అంటూ జనాలు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ అ సెంటిమెంట్‌ను ఇక్కడా వదల్లేదు కదా? అని మహేష్‌ బాబు ఫ్యాన్స్ అంటున్నారు.

త్రివిక్రమ్ అ సెంటిమెంట్ అందరికీ తెలిసిందే. అతడు, అ ఆ, అత్తారింటికి దారేది ఇలా ఎన్నెన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక మహేష్‌ బాబు త్రివిక్రమ్ అంటే.. మూడక్షరాల సెంటిమెంట్ ఉంటుంది. అతడు, ఖలేజా ఆ కోవలోకే వస్తాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం త్రివిక్రమ్ తన అ సెంటిమెంట్ ఫాలో అవుతూనే కథలోంచి ఈ టైటిల్‌ను పట్టుకొచ్చాడట.

 

ఈ సినిమా అంతా కూడా అమ్మ చుట్టే తిరుగుతుందని, అందుకే అమ్మ కథ అని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ టైటిల్ పట్ల మహేష్‌ బాబు ఫ్యాన్స్ సైతం సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ మీద జనాలు ట్రోల్స్, మీమ్స్ స్టార్ట్ చేశారు.

మరి ఈ అమ్మకథ టైటిల్‌ను అలానే ఉంచుతారా? మార్చేస్తారా? అన్నది చూడాలి. అయితే ఈ అమ్మ పాత్రకు ఏ సీనియర్ హీరోని తీసుకుంటారా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. అసలే ఈ సినిమాలో శ్రీలీల పాత్రను అతడు పూరిని మించి ఉండేలా డిజైన్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాకు శ్రీలీల మేజర్ ప్లస్‌గా నిలుస్తుందట. ఇక పూజా హెగ్డే పరిస్థితి ఎలా ఉంటుందనే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మహేష్‌ బాబు పూజా హెగ్డేలది హిట్ కాంబో అన్న సంగతి తెలిసిందే. శ్రీలీలతో మహేష్‌ బాబు ఎలా మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే

Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News