Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ సర్‌ప్రైజ్

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు నాడు ఫ్యాన్స్‌కు గిఫ్ట్ లభించింది. 

Last Updated : Aug 9, 2020, 11:24 AM IST
Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ సర్‌ప్రైజ్

Mahesh Babu Birthday Gift: టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) పుట్టినరోజు నాడు ఫ్యాన్స్‌కు గిఫ్ట్ లభించింది. ఫ్యాన్స్ అంతా ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ ( sarkaru vari pata ) మోష‌న్ పోస్ట‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. ఇక రిలీజ్ కాగానే మహేష్ మోషన్ పోస్టర్ రికార్డులు తిరగరాస్తూ అభిమానులను అలరిస్తోంది. Also read: Mahesh Babu: టాలీవుడ్ యువరాజుకు హ్యాపీ బర్త్ డే

ఈ మోషన్ పోస్టర్‌లో మహేష్ ఒక రూపాయి నాణెన్ని ఎగ‌ర‌వేస్తూ కనిపిస్తారు. అయితే ఇక్కడ మహేష్ కనబడరు.. అతని చేయి మాత్రమే కనిపిస్తోంది. స‌ర్కారు వారి పాట అంటూ.. హుక్ లైన్‌ బ్యాగ్రౌండ్‌లో చిన్న బీట్‌గా వ‌స్తుంది. 

ఈ మోష‌న్ పోస్ట‌ర్‌తో నిర్మాతలు మ‌హేశ్‌కు జన్మదిన శుభాకాంక్ష‌లు తెలియజేస్తూ అభిమానులకు పెద్ద గిఫ్ట్‌ను ఇచ్చారు. ఈ సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. ఏదిఏమైనప్పటికీ.. మహేష్ మోషన్ పోస్టర్ వచ్చి రాగానే.. రికార్డులు నెలకోల్పడానికి రెడీగా ఉంది. Also read: Mahesh Babu: సర్కార్ వారి పాట.. ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌కి గురిచేస్తోన్న పోస్టర్‌

Trending News