Mahesh Babu Ponniyin Selvan: పొన్నియన్‌ సెల్వన్‌-1లో.. మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన పాత్ర ఇదే!

Mahesh Babu rejected Mani Ratnams Ponniyin Selvan 1. పొన్నియన్‌ సెల్వన్‌-1లో జయం రవి రోల్‌ను ముందుగా మహేష్ బాబు చేశారట. కార్తి రోల్‌ను దళపతి విజయ్‌ చేశారట.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 30, 2022, 03:18 PM IST
  • ప్రేక్షకుల ముందుకు పొన్నియన్‌ సెల్వన్‌-1
  • మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన పాత్ర ఇదే
  • పదేళ్ల క్రితం వేరే తారాగణంతో
Mahesh Babu Ponniyin Selvan: పొన్నియన్‌ సెల్వన్‌-1లో.. మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన పాత్ర ఇదే!

Mahesh Babu rejected Jayam Ravi Role in Mani Ratnams Ponniyin Selvan 1: 'మణిరత్నం' దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌-1'. క‌ల్కి కృష్ణమూర్తి ర‌చించిన పొన్నియిన్ సెల్వన్‌ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో నటించారు. పీఎస్‌-1 నుంచి విడుదలైన టైటిల్‌ పోస్టర్ నుంచి ట్రైలర్‌ వరకు అన్ని కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్‌ చేసాయి. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన పొన్నియన్‌ సెల్వన్‌-1 నేడు విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

పొన్నియన్‌ సెల్వన్‌-1 సినిమా కథను డైరెక్టర్ మణిరత్నం దశాబ్ధ కాలం క్రీతమే ప్రకటించారు. షూటింగ్‌ కూడా మొదలు పెట్టారు. అయితే కొన్ని కారణాలతో షూటింగ్‌ ఆరంభంలోనే ఆగిపోయింది. భారీ తారాగణంతో ఇన్నాళ్లకు పీఎస్‌-1 పూర్తయింది. అయితే పదేళ్ల క్రితం మణిరత్నం వేరే తారాగణంతో సినిమాను ప్రారంభించారట. అప్పటి కాస్ట్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఉన్నాడట. జయం రవి రోల్‌ను ముందుగా బాబు చేశారట. కార్తి రోల్‌ను దళపతి విజయ్‌ చేశారట. 

పొన్నియన్‌ సెల్వన్‌-1 సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం శుక్రవారం రోజున తమిళంతో పాటు  తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయింది. రెండో భాగం 10 నెలల లోపు విడుదల కానున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ మణిరత్నం వెల్లడించారు. మొదటి భాగాన్ని మణిరత్నం 150 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా.. ఏఆర్‌ రెహమన్‌ సంగీతం అందించారు. 

Also Read: Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్‌ ఆశలు గల్లంతు! 

Also Read: Munugode Bypoll : ఇదేందయా ఇది.. నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్! మునుగోడు నేతలకు దండం పెట్టాల్సిందే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x