Mahesh Babu Caravan At Yashoda: యశోద హాస్పిటల్ వద్ద మహేష్‌ బాబు కేరవ్యాన్.. అసలు ముచ్చట ఏంటంటే..?

Mahesh Babu Caravan at Yashoda Hospital: మహేష్‌ బాబు కేరవ్యాన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. యశోద హాస్పిటల్ వద్ద మహేష్‌ బాబు సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 01:02 PM IST
  • ఫుల్ స్వింగ్‌లో SSMB28 షూటింగ్
  • గ్యాప్‌లో ఆటలు ఆడేస్తోన్న త్రివిక్రమ్
  • యశోద హాస్పిటల్ వద్ద మహేష్‌ కేరవ్యాన్
Mahesh Babu Caravan At Yashoda: యశోద హాస్పిటల్ వద్ద మహేష్‌ బాబు కేరవ్యాన్.. అసలు ముచ్చట ఏంటంటే..?

Mahesh Babu Caravan at Yashoda Hospital: మహేష్‌ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తోన్న సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్పీడులో జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందట. షూటింగ్ గ్యాప్‌తో త్రివిక్రమ్ క్రికెట్ కూడా ఆడేస్తున్నాడు. చిత్రయూనిట్‌తో కలిసి త్రివిక్రమ్ ఆడిన ఆట, కొట్టిన షాట్లు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను కూడా కంటిన్యూగా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం నిన్న రాత్రి నుంచి టీం కష్టపడుతోందట.

యశోద హాస్పిటల్ వద్ద ఈ సీన్లు ఉన్నాయట. నిన్న నైట్ నుంచి మహేష్ బాబు కేరవ్యాన్ అక్కడే ఉందట. దీంతో నెటిజన్లు రకరకాలుగా కథను గెస్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా అక్కడే ఉందట. పూజా హెగ్డేను ఎవరో పొడిచి ఉంటారు.. అందుకే ఇలా హాస్పిటల్ సీన్లు ప్లాన్ చేసినట్టున్నారు అని ఎవరికి తోచినట్టుగా వారే కథను అల్లేసుకుంటున్నారు.

మహేష్‌ బాబు కేరవ్యాన్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుంటే మళ్లీ త్రివిక్రమ్ పాత శైలిలోనే సినిమాను తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. అల వైకుంఠపురుములో ఉన్నట్టుగా హాస్పిటల్ సీన్లను తీస్తున్నాడా? అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటుగా శ్రీలీల కూడా నడిస్తోన్న సంగతి తెలిసిందే.

మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న ఈ హ్యాట్రిక్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ఇది వరకు నిర్మాత నాగవంశీ ప్రకటించిన విషయం విదితమే. ఈ సినిమా తరువాత మహేష్‌ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ మీద కూర్చుంటాడు. గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట అంటూ సందడి చేశాడు. ఈ సినిమా టాక్‌ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించాయి.

Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?

Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News