Mahesh Babu as Software Engineer in Trivikram Movie: మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ(చినబాబు) భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సింది. కానీ మహేష్ బాబు తల్లి చనిపోవడంతో ఈ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం మీద కాస్త సందిగ్ధత నెలకొంది.
మొదటి షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ లు కొన్ని షూట్ చేశారు. రెండవ షెడ్యూల్లో కొన్ని కీలక సీన్స్ షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఇక ఈ రెండో షెడ్యూల్ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక గాసిప్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ ఇప్పటి వరకు తన సినిమాల్లో చాలా రకాల పాత్రలు పోషించాడు కానీ ఇలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర పోషించడం ఇదే మొదటి సారి.
మహర్షి సినిమాలో ఆయన ఒక ప్రముఖ కంపెనీకి సీఈవోగా నటించారు కానీ ఈసారి ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపంచనుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 15వ తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించే అవకాశం ఉందని, ఈ షెడ్యూల్ లో పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో సాగే కొన్ని సీన్స్ షూట్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే కూడా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు సినిమా మంచి స్పందన దక్కించుకోగా ఖలేజా మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూడో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయ. ఇక ఈ సినిమాకు ‘ఆరంభం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేశారని ఇక అఫీషియల్ గా దాన్ని అనౌన్స్ చేయడమే ఆఖరు అని అంటున్నారు.
Also Read: OTT Releases Tomorrow: ఓటీటీలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల లిస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook