SSMB29: మహేష్-రాజమౌళి సినిమాలో ఇండోనేషియా హీరోయిన్... ఆకాశాన్ని అంటుతున్న బడ్జెట్

Mahesh Babu: రాజమౌళి సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. అలాంటి రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు అని తెలియగానే సినీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం కోసం తెలుగు వారే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 11:29 AM IST
SSMB29: మహేష్-రాజమౌళి సినిమాలో ఇండోనేషియా హీరోయిన్... ఆకాశాన్ని అంటుతున్న బడ్జెట్

Rajamouli: మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం చిత్రం రిలీజ్ కి సిద్ధమవుతున్నారు. అనుకోని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన ఈ చిత్రం ఫైనల్ గా భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి పండుగకు రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తూ ఉండగా రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనుంది. కాగా ఈ సినిమా అయిన వెంటనే మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్టు రాజమౌళితో ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆస్కార్ అవార్డు సైతం అందుకున్న ఈ చిత్రం రాజమౌళి పైన ఉన్న క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా అనుకోని లెవెల్ కి తీసుకెళ్ళింది. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తీసిన దర్శకుడు ఒక సినిమా తీస్తున్నారు అనగానే ప్రపంచమంతా ఆ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి తగ్గట్టుగానే రాజమౌళి మహేష్ బాబు తో తాను తీస్తున్న తదుపరి ప్రాజెక్టు ఎవరు ఊహించని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్టు దాదాపుగా లాక్ అయిపోయింది. ఏప్రిల్ నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తారు అని సమాచారం. అయితే ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌న్న విష‌యంలో చాలా రోజుల నుంచీ చర్చలు కొనసాగుతున్నాయి. బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే పేరు గ‌ట్టిగా వినిపిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ ఇండోనేషియ‌న్ క‌థానాయిక‌ చెల్సియా ఇస్లాన్ ని ఎంచుకున్నారని సమాచారం. ఈ ఇండోనేషియా నటి కొన్ని హాలీవుడ్ సినిమాలలో న‌టించింది. ఇటీవ‌ల ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె రాక దాదాపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. 

అయితే ఈ హీరోయిన్ ని ఈ సినిమాలో క‌థానాయికను పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీల‌క పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది. 

ఇక ఈ చిత్రం గురించి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇండియానా జోన్స్‌ త‌రహాలో సాగే క‌థ కావడంతో మూడు దేశాల్లో కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నారట. దాదాపు స‌గం సినిమా ఒకే సెట్లో జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. అందుకోసం ఓ విశాల‌మైన సెట్ ని తీర్చిదిద్దే ప‌నిలో చిత్ర‌బృందం నిమ‌గ్న‌మై ఉంది. కాగా ఈ సినిమా బడ్జెట్ ఆర్ఆర్ఆర్ కన్నా ఎక్కువ ఉంటుందని.. దాదాపు రూ.1500 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌నున్న‌ట్టు వినికిడి. ఇక ఈ రేంజ్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా.. ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో తెలియాలి అంతే మాత్రం మరికొద్ది సంవత్సరాలు వేచి చూడాల్సిందే. 

Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా

Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News