Sunny Leone Song: 'మధుబన్' సాంగ్ వివాదం..ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న 'అరెస్ట్ సన్నీలియోన్' హ్యాష్ టాగ్!

Madhuban song: బాలీవుడ్ నటి సన్నీలియోన్ నటించిన లేటేస్ట్ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం'అరెస్ట్ సన్నీలియోన్' హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 07:23 PM IST
  • సన్నీలియోన్ 'మధుబన్' సాంగ్ వివాదం
  • ట్రెండ్ అవుతున్న 'అరెస్ట్ సన్నీలియోన్' హ్యాష్ టాగ్
  • ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్
Sunny Leone Song: 'మధుబన్' సాంగ్ వివాదం..ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న 'అరెస్ట్ సన్నీలియోన్' హ్యాష్ టాగ్!

Sunny Leone 'Madhuban' song Controversy: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ లేటేస్ట్ సాంగ్ 'మధుబన్' (Madhuban Song) వివాదాస్పదమవుతోంది. ఈ పాట తమ మతపరమైన మనోభావాలను దెబ్బ తీసిందంటూ...ఓ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 'అరెస్ట్ సన్నీలియోన్' (Arrest Sunny Leone) హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ‘'మధుబన్‌ మే రాధిక నాచే' (Madhuban Mein Radhika Nache) అనే ఈ సాంగ్ ను డిసెంబర్ 22న రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లిరిక్స్, థీమ్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని మధురకు చెందిన పూజారులు (Mathura priests) అయితే ఈ పాటను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని..వెంటనే తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా (Madhya Pradesh Home Minister Narottam Mishra) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నటి సన్నీలియోన్, సాంగ్ అలపించిన షరీబ్, తీషి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు, మూడ్రోజుల్లోగా ఈ అభ్యంతరకర వీడియోను తొలగించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Sunny Leone: వివాదంలో సన్నీలియోన్ సాంగ్...నిషేధించాలంటున్న పూజారులు..

దీనిపై మ్యూజిక్ కంపెనీ స్పందించింది. 'మధుబన్' పాటలోని లిరిక్స్ మారుస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మార్చిన పాటను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొంది. తాజాగా సన్నీలియోన్ (Sunny Leone) మరో మ్యూజిక్ వీడియో 'మచ్లి' (Machhli) విడుదలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆదిల్ షేక్ దర్శకత్వం వహించి..కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ను పావ్నీ పాండే, షాహిద్ మాల్యా పాడారు, 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News