Thalapathy Vijay: అప్పుడే లియో రీ-రిలీజ్.. ఆశ్చర్యపోతున్న ప్రేక్షకులు..

Leo Re-release: ఈమధ్య రీ-రిలీజుల ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఎప్పుడో విడుదలైన సినిమాలు ఇప్పుడు మళ్లీ విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఆశ్చర్యం కొద్ది ఇప్పుడు విడుదలై నెల కూడా కానీ సినిమా రీ రిలీజ్ అంటూ వచ్చిన వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 06:47 PM IST
Thalapathy Vijay: అప్పుడే లియో రీ-రిలీజ్.. ఆశ్చర్యపోతున్న ప్రేక్షకులు..

Leo: తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల మదిలో కూడా స్టార్ దర్శకుడు స్టేటస్ అనుకున్నారు లోకేష్ కనగరాజు. ఆయన తీసిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సూపర్ హిట్లగా నిలిచాయి.

కాదా లోకేష్ కనగరాజు సినిమాటికి యూనివర్స్ పైన అందరికీ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ యూనివర్స్ నుంచి ఏ సినిమా వచ్చినా అది మినిమం గ్యారంటీ హిట్ అని అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు. కాగా ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక బస్టర్ల తర్వాత ఈ మధ్య ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన సినిమా లియో. మొదటి రోజు నుంచి ఈ చిత్రం మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోయింది. ఏకంగా 500 కోట్ల పైన కలెక్షన్ సాధించి.. లోకేష్ సినిమా యవరేజ్ గా ఆడిన బాక్సాఫీస్ దగ్గర సునామి ఎలా ఉంటుందో రుజువు చేసింది. ఇక లోకేష్ తో పాటు ఈ చిత్రం తలపతి విజయ్ స్టామినాని కూడా మరోసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసింది.

మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్‌ను అధిగమించి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఈ చిత్రం థియేటర్స్ నుంచి ఎట్టేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ చిత్రం విడుదలైంది అక్టోబర్ 19న. అంటే ఈ చిత్రం విడుదలై దాదాపు నెల కావోస్తోంది. మరొక పక్క అనేక చిత్రాలు విడుదల అవుతూ ఉండగా ఈ చిత్రాన్ని థియేటర్స్ నుంచి ఎత్తేస్తూ వచ్చారు. కానీ ఈ నేపథ్యంలో షికారు చేసుకున్న ఒక వార్త అందరిని ఆశ్చర్యపరిస్తూ విజయ్ అభిమానులను ఖుషి చేస్తోంది. 

ఇంతకీ ఆ వార్త ఏమిటి అంటే తాజా అప్‌డేట్‌ ప్రకారం తమిళనాడు అంతటా లియో సినిమాను మరో 100 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో రీ-రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించే సినిమాలు ఏమీ దగ్గర్లో లేవు. అక్కడ ఈ మధ్య విడుదలైన కార్తీ జపాన్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక పెద్ద సినిమాలు ఏవి ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా లేవు. దీంతో లియోను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులోనూ సినిమా రిలీజై 5 వారాలు దాటినా 'లియో' బాక్సాఫీస్ దగ్గర స్థిరమైన వసూళ్లు సాధిస్తోంది. అందుకే ఈ చిత్రాన్నే మళ్ళీ థియేటర్స్ వారు ప్రదర్శిద్దాం అనుకుంటున్నారట. కాగా సినిమా విడుదలై నెల కూడా తిరక్కముందే ఇలా రీ రిలీజ్ అంటూ వార్త రావడంతో ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. కాగా ఒకప్పుడు అయితే వంద రోజులు.. వెయ్యి రోజులు కూడా సినిమాలు ఆడేవి కానీ ఇప్పుడు కలెక్షన్స్ పరంగానే రన్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే సినిమా 15, 20 రోజులు ఆడితే చాలా ఎక్కువ. అది బ్లాక్ బస్టర్ సినిమా అయినా ఆ 20 రోజుల్లోనే కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఇప్పుడు నెల తిరగకుండానే మళ్లీ లియో విడుదల చేయడానికి కూడా మనం రి-రిలీజ్ అనే అనాల్సి వస్తోంది.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News