Leena Manimekalai Shares another controversial photo: భారత సంతతికి చెందిన కెనడా ఫిలిం మేకర్ లీనా మణిమేఖలై షేర్ చేసిన ఒక పోస్టర్ వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. కాళీమాత వేషధారణలో ఉన్న ఒక మహిళ సిగరెట్ తాగుతూ ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన జెండా చేతిలో పట్టుకొని ఉన్న పోస్టర్ ఆమె షేర్ చేయగా అది పెను వివాదానికి దారి తీసింది. హిందూ మతస్తుల మత విశ్వాసాలను దెబ్బతీసిన విధంగా ఉందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ విషయంలో ఇండియన్ ఎంబసీ కూడా రంగ ప్రవేశం చేసింది.
భారత ప్రభుత్వం ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో మణిమేఖలై షేర్ చేసిన ఫోటో ఉన్న ట్వీట్ ను తొలగించింది. అయితే లీనా మీద భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా భారతదేశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొహిత్రా, స్వర భాస్కర్ లాంటివాళ్ళు ఆమె షేర్ చేసిన పోస్టర్లో తప్పేముంది అంటూ ఆమెకు మద్దతుగా కూడా నిలబడ్డారు ఇంత వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆమె ఇప్పుడు మరో ఫోటో తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేసి సరికొత్త చర్చకు దారి తీసింది మణిమేఖలై.
శివుడి వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి పార్వతీదేవి వేషధారణంగా ఉన్న మరో వ్యక్తి సిగరెట్ తాగుతున్నట్లు ఆమె షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తోంది. తాను చేసింది తప్పేమీ కాదని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా పాత ఫోటోని ఆమె తీసుకొచ్చి షేర్ చేసినట్లు నెటిజనులు భావిస్తున్నారు. ఇక తాను షేర్ చేసిన పోస్టర్ కరెక్టేనని, దాని కోసం ఎంత దాకా అయినా వెళ్ళడానికి సిద్ధమేనని చెబుతోంది.. అంతేకాక తను షేర్ చేసిన పోస్టర్ చూసి తనను అరెస్ట్ చేయాలని కామెంట్ చేస్తున్న వారంతా సినిమా చూడాలని సినిమా చూసిన తర్వాత కూడా అదే మాట అంటే వారేం చెప్పినా చేయడానికి సిద్ధమంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.
Also Read: Samantha Ruthprabhu: సమంత బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోతోనే మొదటి సినిమా?
Also Read: Naga Chaitanya: సమంత కుక్కకి నాగచైతన్య థాంక్స్.. ప్రేమించడం ఎలానో నేర్పావంటూ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook