Latest OTT Releases: కితకితలు పెట్టే కామెడీ షోలు, ట్విస్టుల మీద ట్విస్టులున్న మర్డర్ మిస్టరీలు

Latest OTT Releases This Weekend: జూలై రెండో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి, ఓటిటి ఆడియెన్స్ కోసం అమేజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యాపిల్ టీవీ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 08:51 AM IST
Latest OTT Releases: కితకితలు పెట్టే కామెడీ షోలు, ట్విస్టుల మీద ట్విస్టులున్న మర్డర్ మిస్టరీలు

Latest OTT Releases This Weekend: జూలై రెండో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి, ఓటిటి ఆడియెన్స్ కోసం అమేజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యాపిల్ టీవీ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇండియన్ నుంచి హాలీవుడ్, కొరియన్ వరకు అనేక ఆసక్తికరమైన షోలు మీ కోసం వేచిచూస్తున్నాయి. ఇంతకీ ఆ షోలు ఏంటనేది తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.

మాయాబజార్ ఫర్ సేల్
కామెడి డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన మాయాబజార్ ఫర్ సేల్ అనే వెబ్ సిరీస్ జీ5 లో జూలై 14న విడుదలైంది. నవదీప్, నరేష్, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ని గౌతమి చల్లగుల్ల డైరెక్ట్ చేయగా రానా దగ్గుబాటి నిర్మించాడు.

ది ఆఫ్టర్ పార్టీ సీజన్ 2 వెబ్ సిరీస్
కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ అమెరికన్ మర్డర్ మిస్టరీ జూలై 12న యాపిల్ టీవీలో విడుదలైంది. హై స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ పార్టీ చేసుకుంటారు. అదే రాత్రి అక్కడే ఒక మర్డర్ జరుగుతుంది. ఆ రాత్రి ఏం జరిగిందనే కథనంతో తెరకెక్కిన టెలివిజన్ సిరీస్ ఇది. 

కింగ్ ది ల్యాండ్ వెబ్ సిరీస్
కింగ్ ది ల్యాండ్ అనే కొరియన్ వెబ్ సిరీస్ జూలై 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

బర్న్ ది హౌజ్ డౌన్ వెబ్ సిరీస్
బర్న్ ది హౌజ్ డౌన్ అనే జపాన్ వెబ్ సిరీస్ జూలై 13న నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. 13 ఏళ్ల క్రితం జరిగిన ఒక అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆ అగ్ని ప్రమాదంతో ఏ సంబంధం లేని తన తల్లిపై అందుకు బాద్యురాలిగా నింద పడిందని తెలుసుకున్న ఓ యువతి చేసే అండర్ కవర్ ఆపరేషన్ లాంటిదే ఈ బర్న్ ది హౌజ్ డౌన్ వెబ్ సిరీస్.

ది ట్రయల్ వెబ్ సిరీస్
కాజోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది ట్రయల్ అనే వెబ్ సిరీస్ జూలై 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది. ది గుడ్ వైఫ్ అనే అమెరికన్ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన లీగల్ డ్రామా ఇది. 

ఇది కూడా చదవండి: Sai Dharam Tej About Politics: రాజకీయాలపై సింపుల్‌గా తేల్చిపడేసిన సాయిధరమ్ తేజ్

కోహ్రా 
ఒక ఎన్ఆర్ఐ వరుడు పెళ్లికి కొద్ది రోజుల ముందు హత్యకు గురవుతాడు. అతడి మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లకు ఎదురైన చిత్ర, విచిత్రమైన అనుభవాల పంజాబీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ కోహ్రా వెబ్ సిరీస్. ఇది నెట్ ఫ్లిక్స్‌లో జూలై 15న విడుదలైంది. ఇలాంటి మరెన్నో ఓటిటి షోలు మీ కోసం మరిన్ని రెడీ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Sreeleela vs Rashmika Mandanna: రష్మిక మందన స్థానం కబ్జా చేసిన శ్రీలీల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News