Kriti Sanon: సెలబ్రిటీల మధ్య యూనిటీ లేదు.. .. కృతి సనన్ సెన్సేషనల్ కామెంట్స్

Crew: కృతి సనన్ బాలీవుడ్ సెలబ్రిటీల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలైనా కేవలం హీరోయిన్ ఉన్న సినిమాలైనా ఒకటే అని.. అలానే సినిమా మంచిగా ఆడితే ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 12, 2024, 09:40 AM IST
Kriti Sanon: సెలబ్రిటీల మధ్య యూనిటీ లేదు.. .. కృతి సనన్ సెన్సేషనల్ కామెంట్స్

Kriti Sanon: ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ కృతి సనన్. మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ప్రభాస్ ఆది పురుష్ తో మరింత పేరు తెచ్చుకుంది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా డిజాస్టర్స్ నమోదు చేసుకోవడంతో ఈమెకు ఆఫర్లు అయితే ఇక్కడ పెద్దగా రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

అక్కడ ఎన్నో చిత్రాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం తన ‘క్రూ’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
కృతి సనన్, టబు, కరీనా కపూర్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం గత నెల మార్చ్ 29న రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్.

మీడియాతో కృతి సనన్ మాట్లాడుతూ.. “ఒక చిత్రంలో స్టార్ హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ ఆ సినిమాకి రారు. కథ ముఖ్యంగా బాగుండాలి. దురదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు, నిర్మాతలకు కూడా ఈ విషయం అస్సలు అర్ధం కావట్లేదు. వాళ్లందరూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు, డబ్బులు రావు అని అనుకుంటున్నారు. ఇది అబద్దం. స్టార్ హీరోలెవ్వరూ లేకపోయినా మా క్రూ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోండి. అలియాభట్ ముఖ్యపాత్రలో లో వచ్చిన గంగూభాయ్ కతీయవాడి సినిమా కూడా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తెచ్చింది. అందులో కూడా స్టార్ హీరోలు లేరు. మరి ఈ సినిమాలు చూశాక కూడా ఇంకా ఎందుకు హీరోయిన్స్ సినిమాలకు బడ్జెట్ పరిమితులు  పెడుతున్నారో అర్ధం కావట్లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే కృతి సనన్ బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో ఏదో మొహమాటానికి ఒకర్నొకరు పొగుడుతున్నారు. దానికంటే ఆపదలో ఉన్న తోటి నటీనటులకు సహాయంగా నిలబడితే మరింత బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ నటీనటుల మధ్య యూనిటీ అంతగా లేదు. ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, అంతమంది ఏడుస్తున్నాడు కూడా,” అంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఈమె చెప్పిన మాటలు బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News