Krithi Shetty Flops : కృతి శెట్టి కెరీర్ ఇక క్లోజ్‌?.. బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ

Krithi Shetty Flop Movies కృతి శెట్టి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. చివరకు కస్టడీ సినిమా అయినా కృతిని గట్టెక్కిస్తుందని అంతా భావించారు. కానీ కృతిని ఈ సినిమా సైతం ముంచేసింది. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న కృతికి కస్టడీ రూపంలో మరో దెబ్బ తగిలింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 04:01 PM IST
  • ఉప్పెనతో ఎగిసిన కృతి శెట్టి
  • వరుస ఫ్లాపులతో ఢీలాపడ్డ బ్యూటీ
  • కృతి శెట్టిని ముంచిన కస్టడీ
Krithi Shetty Flops : కృతి శెట్టి కెరీర్ ఇక క్లోజ్‌?.. బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ

Krithi Shetty Flop Movies ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసింది కృతి శెట్టి. ఉప్పెన బ్యూటీగా కృతికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. కరోనా సమయంలో కృతి ఎక్కువగా ఫేమస్ అయింది. వీడియో సాంగ్స్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చాయి. అయితే ఉప్పెనలో కృతి శెట్టి కనిపించిన తీరు, నటించిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. అయితే ఉప్పెన సినిమా తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన సినిమా రిలీజ్ కాక ముందే సినిమాలకు కమిట్ అయింది.

ఉప్పెన తరువాత కృతి శెట్టి చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించలేకపోయింది. సంక్రాంతి సీజన్‌లో రావడంతో బంగార్రాజు కాస్త గట్టెక్కింది. శ్యాం సింగ రాయ్ అయితే కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచిందని ట్రేడ్ లెక్కలు చెబుతుంటాయి. ఇవి రెండు సినిమాలు కృతి శెట్టి ఖాతాలో పర్వాలేదనిపించేలా ఉంటాయి.

రామ్ వారియర్, నితిన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు దారుణాతి దారుణంగా బోల్తా కొట్టేశాయి. బాక్సాఫీస్ వద్ద ఆ మూడు చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన నాగ చైతన్య కస్టడీ సినిమా మీదే కృతి అంచనాలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది.

Also Read:  Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?

ఇలా వరుసగా కృతి ఖాతాలో డిజాస్టర్లు పడుతున్నాయి. మరో వైపు శ్రీలీల దుమ్ములేపేస్తోంది. ఇంకో వైపు సంయుక్త మీనన్ లక్కీ హ్యాండ్‌గా మారింది. ఇలాంటి తరుణంలో కృతి శెట్టి కెరీర్ ప్రమాదంలో పడ్డట్టు కనిపిస్తోంది. చూస్తుంటే.. ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయినట్టే అనిపిస్తోంది. ఇక ఆమె చేతిలో ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ కూడా లేదని తెలుస్తోంది. ఇండస్ట్రీలో హీరోయిన్ల టైం కూడా చాలా తక్కువే అన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, రష్మిక మందాన్న వంటి వారు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం విదితమే.

Also Read:  Naresh Pavitra Kiss : రెచ్చిపోయిన జంట.. షోలో నరేష్ పవిత్రల ముద్దులు.. బంధం మీద క్లారిటీ వచ్చేసినట్టే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News